మంగళవారం 02 జూన్ 2020
Cinema - Mar 01, 2020 , 15:52:54

30 మిలియన్ల ఫాలోవర్లు..సల్మాన్‌ థ్యాంక్స్‌..వీడియో

30 మిలియన్ల ఫాలోవర్లు..సల్మాన్‌ థ్యాంక్స్‌..వీడియో

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌కు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 80 లలో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సల్లూభాయ్‌ సక్సెస్‌ఫుల్‌ గా కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. సోషల్‌మీడియాలో సల్మాన్‌ఖాన్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా లక్షల్లో ఉంటుంది. తాజాగా సల్మాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో 30 మిలియన్ల ఫాలోవర్లు చేరారు. తనను ఎంతో అభిమానిస్తోన్న ఫ్యాన్స్‌కు ఈ సందర్భంగా సల్మాన్‌ ధన్యవాదాలు తెలుపుతూ షార్ట్‌ వీడియోను పోస్ట్‌ చేశాడు. సల్మాన్‌ వెనక్కి తిరుగుతూ సైగలతో సలామ్‌, ధన్యవాదాలు అంటూ  అభిమానులకు చెప్పే వీడియో ట్రెండింగ్‌ అవుతోంది. logo