Salaar | నెట్‌ఫ్లిక్స్‌లో సలార్ హవా.. ప్రభాస్ క్రేజ్‌కు ఔరా అనాల్సిందే..!
Salaar | గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ సలార్ (Salaar). ప్రపంచవ్యాప్తంగా 2023 డిసెంబర్ 22న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన Salaar Part-1 Ceasefire జనవరి 20 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ అవుతోన్న విషయం తెలిసిందే. సలార్ హిందీ మినహా మిగిలిన ప్రధాన భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
Salaar | గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ సలార్ (Salaar). కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో సలార్ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. Salaar Part-1 Ceasefire ప్రపంచవ్యాప్తంగా 2023 డిసెంబర్ 22న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కాగా సలార్ పార్టు 1 జనవరి 20 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ అవుతోన్న విషయం తెలిసిందే. సలార్ హిందీ మినహా మిగిలిన ప్రధాన భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో కూడా సలార్ మేనియా కొనసాగుతుందంటూ ఇప్పటికే ఓ అప్డేట్ తెరపైకి వచ్చిందని తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ ఇండియా చార్ట్స్‌లో సలార్ పార్టు 1 అత్యధిక వ్యూయర్షిప్తో నంబర్ 1 స్థానంలో నిలిచింది. తెలుగు, తమిళ్ వెర్షన్స్ టాప్ 2 స్థానాల్లో నిలువగా.. కన్నడ, మలయాళ వెర్షన్లు 5వ, 7వ స్థానంలో నిలిచినట్టు అప్డేట్స్ కూడా వచ్చాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రభాస్ అభిమానులను ఖుషీ చేస్తోంది.
సలార్ నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 గ్లోబల్ చార్ట్స్ (నాన్ ఇంగ్లీష్ కేటగిరి)లో మూడో స్థానంలో నిలిచింది. సలార్ జనవరి 15-21 మధ్య ఈ అరుదైన ఫీట్ అందుకుంది. ప్రభాస్‌కు వరల్డ్‌వైడ్‌గా ఏ రేంజ్లో క్రేజ్ ఉందో ఈ ఒక్క విషయంతో అర్థం చేసుకోవచ్చు. ఓటీటీలో విడుదలైన తొలి వారంలోనే వరల్డ్‌వైడ్‌గా ఈ రేంజ్లో పాపులారిటీ అందుకున్న తెలుగు సినిమాగా టాప్‌లో నిలుస్తూ.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది. నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే సలార్ ఇంగ్లీష్ వెర్షన్ కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

Salaar
సలార్‌లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. టాలీవుడ్ యాక్టర్ జగపతి బాబు రాజమన్నార్ పాత్రలో మెరువగా.. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ వరదరాజ మన్నార్ ది కింగ్ రోల్లో నటించారు. బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్, సప్తగిరి, సిమ్రత్ కౌర్, పృథ్విరాజ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

