Salaar Movie | రిలీజ్‌కింకా రెండు నెలలకు పైగానే టైమ్ ఉండటంతో సలార్ మేకర్స్ ప్రమోషన్లను గ్రాండ్‌గా జరపాలని ప్లాన్ వేస్తుంది. ప్రమోషన్లో భాగంగా ముందుగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే ట్రైలర్ కట్కు సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయ్యాయని ఇన్సైడ్ టాక్. మూడు నెలల ముందు రిలీజైన టీజర్ రికార్డుల సృష్టించిన విషయం పక్కన పెడితే.. ప్రభాస్ అభిమానులను ఫుల్ సాటిస్ఫై చేసింది లేదు. ప్రభాస్ మొహం కూడా చూపించలేరని నిరాశ పడ్డ ఫ్యాన్స్ ఎందరో. దాంతో ఇప్పుడు ట్రైలర్‌ను ఫ్యాన్స్‌ను సాటిస్ఫై చేసేలా కట్ చేస్తున్నారట.
కాగా ఈ సినిమా కోసం రెండు ట్రైలర్లను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న చిత్రబృందం తొలి ట్రైలర్‌ను ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అక్టోబర్ 23న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. ఒక్క టీజర్‌తోనే కొత్త రికార్డులను సృష్టించిన సలార్.. ట్రైలర్‌తో ఇంకా ఎలాంటి విధ్వంసాలు సృష్టిస్తుందో చూడాలి. ఇక ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ లెక్కలు వింటుంటే గూస్బంప్స్ అనే మాట కూడా చిన్నదిగానే అనిపిస్తుంది. ఒక్క నైజాంలోనే ఈ సినిమాకు రూ.80 కోట్ల డీల్ ఫిక్సయినట్లు టాక్. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రెండొందల కోట్లకు పైగా బిజినెస్ జరుగుతుందట.
రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సలార్ సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. సలార్ సినిమాను ఇంగ్లీష్ భాషలోనూ రిలీజ్ చేసేలా గట్టి ప్రయత్నాలే చేస్తుందట హోంబలే సంస్థ. అంతేకాకుండా విదేశాల్లో పెద్ద ఎత్తున ఈ సినిమా రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నారట. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను పూర్తి చేసుకుంటుంది. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతిహాసన్ నటిస్తుంది. మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు.