Prabhas | స్పిరిట్‌కి రంగం సిద్ధమైంది.. పోలీస్ ఆఫీసర్‌గా సరికొత్త గెటప్‌లో ప్రభాస్!
ఇప్పుడు ప్రపంచమంతా ‘సలార్' ఫివర్‌తో ఉంది. టికెట్లకోసం అభిమానులు పడుతున్న అవస్తలు మామూలుగా లేవు. ఆన్లైన్ బుకింగ్ వచ్చాక కూడా టికెట్లు దొరకడం కష్టమైపోయింది.
Prabhas | ఇప్పుడు ప్రపంచమంతా ‘సలార్’ ఫివర్‌తో ఉంది. టికెట్లకోసం అభిమానులు పడుతున్న అవస్తలు మామూలుగా లేవు. ఆన్లైన్ బుకింగ్ వచ్చాక కూడా టికెట్లు దొరకడం కష్టమైపోయింది. ఆ రోజుల్లో సీనియర్ ఎన్టీయార్, చిరంజీవి సినిమాలు విడుదలైనప్పుడు ఫ్యాన్స్ ఎలాగైతే కిలోమీటర్ల మేర బారులు తీరేవారో.. అలా థియేటర్ల ముందు జనం బారులు తీరడం ‘సలార్’ విషయంలోనే జరుగుతుందంటే అతిశయోక్తికాదు. ప్రభాస్, ప్రశాంత్‌నీల్ క్రేజ్‌కి ఇదొక నిదర్శనం. ఇదిలావుంటే.. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్‌కి టి సిరీస్ సంస్థ ఓ శుభవార్త చెప్పింది.
సంచలన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించిన అప్డేట్ని వారు విడుదల చేశారు. ‘యానిమల్’ మాదిరిగానే.. సందీప్‌రెడ్డి వంగాతో కలిసి టి.సిరీస్ అధినేత భూషణ్‌కుమార్ ‘స్పిరిట్’ సినిమాను నిర్మించనున్నారు. ‘యానిమల్ పార్క్’కు ముందే ఈ ప్రాజెక్ట్ ఉంటుందని వారు తెలిపారు. ఆ తర్వాత ‘యానిమల్ పార్క్’, దాని తర్వాత అల్లు అర్జున్ మూవీ చేయనున్నట్టు వారు ప్రకటించారు. ‘స్పిరిట్’ ఓ కాప్ స్టోరీ అని, అందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కొత్తగా కనిపిస్తారని సందీప్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు కూడా. అంటే త్వరలోనే సందీప్‌రెడ్డి వంగా హీరోగా రెబల్‌స్టార్ ప్రభాస్ దర్శనమివ్వనున్నాడన్నమాట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిరుపేద కుటుంబాలకు ‘మేవా’ ఆర్ధిక సాయం
‘రైతు సంక్షేమమే లక్ష్యంగా కృషి విజ్ఞాన కేంద్రం సేవలు’
Congress | ఢిల్లీ హోటల్లో తాగి కొట్టుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు
‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి చెంప దెబ్బ కావాలి’
Gadwal Collector | కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజ్వాన్ బాషా షేక్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

