పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (prabhas)తో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్టు సలార్ (Salaar). కేజీఎఫ్ చాఫ్టర్ 2 తర్వాత హోంబలే ఫిలిమ్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ (Shruti Haasan) ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అండర్ వరల్డ్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి అందించి..అభిమానులను ఖుషీ చేస్తున్నారు మేకర్స్.
సలార్ యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రిపరేషన్లో ఉన్నారు ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ అండ్ ప్రశాంత్‌నీల్. లొకేషన్లో యాక్షన్ సీన్ల కోసం ప్లాన్ రెడీ చేయడంపై డైరెక్టర్‌తో ఆర్ట్ డైరెక్టర్ డిస్కస్ చేస్తున్న గ్లింప్స్ వీడియోను మేకర్స్ అఫీషియల్ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. సలార్‌లో కేజీఎఫ్ చిత్రాన్ని మించిన థ్రిల్ కలిగించే యాక్షన్ సన్నివేశాలను రెడీ చేస్తున్నాడట ప్రశాంత్‌నీల్. ఈ చిత్రంలో లోయ ప్రాంతంలో వచ్చే ఓ భారీ ఛేజింగ్ ఎపిసోడ్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉండనుందని టాక్ నడుస్తోంది.
కేజీఎఫ్ లాంటి బ్లాక్ బాస్టర్ ప్రాంఛైజీ తర్వాత హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ (Vijay Kirgandur) నిర్మిస్తుండటంతో..సినిమా ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ నెలకొంది. కేజీఎఫ్ చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్ అందించిన రవి బస్రూర్ ఈ చిత్రానికి మరోసారి మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.
Captain @prashanth_neel and Art director @shivakumarart preparing for an action sequence 🔥#Salaar #Prabhas @VKiragandur @hombalefilms @shrutihaasan @IamJagguBhai @RaviBasrur @bhuvangowda84 @SalaarTheSaga pic.twitter.com/Lf2mOM5963
— Salaar (@SalaarTheSaga) May 18, 2022