Salaar Air Salute | ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ లవర్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న చిత్రం ‘సలార్'(Salaar). రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా.. శృతి హాసన్ కథనాయికగా నటిస్తుంది. కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాగా రికార్డు స్థాయిలో బుకింగ్స్ అవుతున్నాయి.
ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఇప్పటినుంచే సంబరాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఇండియాలోని థియేటర్ల దగ్గర ప్రభాస్ కటౌట్లు ఏర్పాటు చేసి.. భారీ బైక్ ర్యాలీలు చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. ఇక చాలా రోజుల తర్వాత ప్రభాస్ నుంచి సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ రాబోతుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ఓవర్సీస్లో కూడా పెద్ద ఎత్తున్న విడుదల అవుతున్న విషయం తెలిసిందే.
తాజాగా కెనడాలోని ప్రభాస్ ఫ్యాన్స్ వినూత్న ప్రదర్శన నిర్వహించారు. కెనడాలోని టొరొంటోలో గల ఒక మైదానంలో ఫ్యాన్స్ సలార్ భారీ పోస్టర్‌ను ఏర్పాటు చేసి.. ప్రభాస్‌కు ఆరు హెలికాప్టర్లతో ఎయిర్ సెల్యూట్ చేశారు. ఇక ఈ ఆరు హెలికాప్టర్లు ఒకేసారి గాల్లోకి ఎగిరేలా ఏర్పాటు చేశారు. ఆ హెలికాఫ్టర్‌లో సెల్యూట్ చేస్తున్నట్లుగా వీడియో క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.