రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ’. సందీప్‌రాజ్ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మిస్తున్నారు. అడవి నేపథ్యంలో సాగే యూనిక్ రొమాంటిక్ డ్రామా ఇది. డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం ఈ సినిమా నుంచి ‘సయ్యారే..’ అనే తొలి గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకులు యం.యం.కీరవాణి విడుదల చేశారు. కాలభైరవ ఈ పాటను స్వరపరిచారు. ఈ సందర్భంగా దర్శకుడు సందీప్‌రాజ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతో పాటు చక్కటి వినోదం కూడా ఉంటుందని అన్నారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథా చిత్రమిదని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. చంద్రబోస్ తన సాహిత్యంతో పాటకు ప్రాణం పోశారని, అందరు మెచ్చే వినూత్న కథాంశమిదని హీరో రోషన్ కనకాల తెలిపారు. బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, రచన-దర్శకత్వం: సందీప్‌రాజ్.