నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం లవ్ స్టోరీ (Love Story). టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో లవ్ స్టోరీ ఒకటి. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేయగా అద్బుతమైన స్పందన వస్తోంది. కాగా ఈ సినిమా గురించి పలు అనుభవాలను నాగచైతన్య మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. లవ్ స్టోరీ రెగ్యులర్ గా వచ్చే అబ్బాయి, అమ్మాయిని కలిసి ప్రేమలో పడే లవ్ డ్రామా కథ కాదన్నాడు.
చాలా క్లిష్ణమైన విషయాలను సృశిస్తూ సినిమా సాగుతుందని చెప్పాడు నాగచైతన్య. ఈ సినిమా చేసేందుకు శేఖర్ కమ్ముల చాలా సమయం తీసుకున్నది నిజమేనన్నాడు. ఈ సమయంలో ఫిల్మ్ మేకింగ్ లో ఉండే సౌందర్యాన్ని ఎంజాయ్ చేశానని, ఈ అనుభవం తనను ఉత్తమ నటుడిగా తీర్చిదిద్దిందని చెప్పుకొచ్చాడు చైతూ. సినిమాలో ఎక్కువ క్రెడిట్ సాయిపల్లవికి ఇవ్వాలి. తన డ్యాన్స్, నటనతో అద్బుతంగా ఆకట్టుకుంటుంది.
కష్టతరమైన డ్యాన్స్ స్టెప్పులను సులభంగా ఎలా చేయాలో సాయిపల్లవి దగ్గరే నేర్చుకున్నానని చెప్పాడు. ఈ చిత్రంలో నా నటనకు ప్రశంసలు అందితే.. అందులో సగభాగం క్రెడిట్ ఈశ్వరీ రావు, డైరెక్టర్ శేఖర్ కమ్ములకే దక్కుతుందన్నాడు నాగచైతన్య. సెప్టెంబర్ 24న విడుదల కానుంది లవ్ స్టోరీ.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Vijay Deverakonda | బాక్సింగ్ రింగ్ లో విజయ్ దేవరకొండ..లైగర్ స్టిల్ వైరల్
Nani | షాహిద్ కపూర్ గొప్ప నటుడు..రీమేక్ అద్భుతం
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!