Saindhav Movie | సంక్రాంతికి వెంకటేష్ ‘సైంధవ్’.. పొంగల్ సినిమాల లిస్ట్ ఇదే..!
Victory Venkatesh | సంక్రాంతికి ఆల్రెడీ అరడజన్ సినిమాలు ఉండగానే తాజాగా వెంకటేష్ (Daggubati Venkatesh) కూడా వస్తున్నాడు. ఆయన నటిస్తున్న సైంధవ్ (Saindhav) జనవరి 13న రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. డిసెంబర్ 22న ముందు విడుదల అనుకున్నా కూడా అదే రోజు సలార్ వస్తుండటంతో డేట్ మార్చుకోక తప్పలేదు.
Victory Venkatesh | సంక్రాంతికి ఆల్రెడీ అరడజన్ సినిమాలు ఉండగానే తాజాగా వెంకటేష్ (Daggubati Venkatesh) కూడా వస్తున్నాడు. ఆయన నటిస్తున్న సైంధవ్ (Saindhav) జనవరి 13న రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. డిసెంబర్ 22న ముందు విడుదల అనుకున్నా కూడా అదే రోజు సలార్ వస్తుండటంతో డేట్ మార్చుకోక తప్పలేదు. శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వెంకటేష్‌కు 75వ చిత్రం కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. దానికి తోడు భారీ బడ్జెట్‌తో సైంధవ్ వస్తుంది. అంత పోటీ ఉన్నా కూడా సంక్రాంతికి వెంకీ ఎందుకు వస్తున్నాడు అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.
దానికి రీజన్ ఒక్కటే.. గతంలో వెంకీ మోస్ట్ సక్సెస్ ఫుల్ మూవీస్ అన్నీ పండక్కే రావడం. 1988 నుంచే సంక్రాంతికి రావడం అలవాటు చేసుకున్నాడు వెంకీ. ఆ ఏడాది రక్తతిలకం వచ్చింది.. 1989లో ప్రేమ విడుదలైంది.. ఇక 1992లో చంటి.. 1994లో పోకిరి రాజా.. 95లో ధర్మచక్రం.. 1996లో చిన్నబ్బాయి.. 2000లో కలిసుందాం రా.. 2001లో దేవీ పుత్రుడు.. 2006లో లక్ష్మి.. 2010లో నమో వెంకటేష.. 2012లో బాడీగార్డ్.. 2013లో సీతమ్మ వాకిట్లో.. 2015లో గోపాలా గోపాలా.. 2019లో ఎఫ్ 2 లాంటి సినిమాలతో సంక్రాంతికి వచ్చాడు వెంకటేష్.
ఇందులో పోకిరి రాజా, చిన్నబ్బాయి, ధర్మచక్రం, బాడీగార్డ్ లాంటి సినిమాలు మినహాయిస్తే దాదాపు అన్నీ విజయాలే ఉన్నాయి. పైగా చంటి, లక్ష్మీ, కలిసుందాం రా లాంటి సినిమాలు వెంకీ మార్కెట్‌ను అమాంతం పెంచేసాయి. అందుకే అంత పోటీ ఉన్నా కూడా కలిసొచ్చిన పండగ కాబట్టి పొంగల్‌కు వచ్చేస్తున్నాడు. మరి సైంధవ్‌తో ఈ సారి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలిక.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

