Virupaksha Movie | సెన్సార్ పూర్తి చేసుకున్న విరూపాక్ష .. రన్ టైమ్ ప్లస్ అయ్యేలా ఉందే..!
Virupaksha Movie Censor | మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కెరీర్ బిగెనింగ్ నుంచి వినూత్న సినిమాలు చేస్తున్నా కమర్షియల్ హీరోగా గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ విరూపాక్ష సినిమాపైనే ఉన్నాయి.
Virupaksha Movie Censor | మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కెరీర్ బిగెనింగ్ నుంచి వినూత్న సినిమాలు చేస్తున్నా కమర్షియల్ హీరోగా గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ విరూపాక్ష సినిమాపైనే ఉన్నాయి. కార్తిక్ దండు దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస ప్రమోషన్లు జరుపుతూ తెగ బిజీగా గడుపుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. రన్ టైమ్ 2 గంటల 25 నిమిషాలకు ఉండనుంది. ఈ సినిమాకు సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు సహా నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు. ఒక ఊరిని వరుస చావులు వెంబటిస్తుంటాయి. ఆ చావులకు గల కారణాలు ఏంటీ అని తెలుసుకోవాడానికి హీరో ఆ ఊరికి వెళ్తాడు. అయితే అక్కడ ఆ హీరోకు ఎలాంటి పరిస్థతులు ఎదురయ్యాయి. అసలు ఆ చావుల వెనక ఉన్న మిస్టరీ ఎంటీ అనే ప్రశ్నల చుట్టు ఈ సినిమా కథ తిరుగుందట.
బ్లాక్ మేజిక్ వంటి అంశాలను ఈ సినిమాలో టచ్ చేశారని తెలుస్తుంది. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సాయి ధరమ్‌కు జోడీగా సంయుక్త హెగ్డే నటిస్తుంది. సునీల్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్ స్వరాలు సమకూర్చుతున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

