బంధాలు నిలవాలని చెప్పాం

‘స్నేహం, పెళ్లి, సహజీవనం అంశాలను చర్చిస్తూ సాగే చిత్రమిది. రెండు జంటల కథతో భావోద్వేగభరితంగా ఉంటుంది’ అన్నారు లక్ష్మణ్ మేనేని. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘మ్యాడ్’. మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతావర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. టి వేణుగోపాల్‌రెడ్డి, బి. కృష్ణారెడ్డి నిర్మించారు. ఈ నెల 6న ఈ చిత్రం విడుదలకానుంది ఈ సందర్భంగా లక్ష్మణ్ మేనేని మాట్లాడుతూ ‘ప్రస్తుతం వైవాహిక బంధాలన్నీ కృత్రిమంగా మారిపోయాయి. రిలేషన్షిప్ డెవలప్ అయ్యేందుకు సమయం కూడా ఇవ్వకుండానే చాలా జంటలు విడాకులు తీసుకుంటున్నారు. సోషల్‌మీడియా కారణంగా మనుషుల మధ్య దూరం పెరిగిందనే అంశాలను ఆవిష్కరిస్తూ ఈసినిమాను తెరకెక్కించాం. బంధాలు చిరకాలం నిలబడాలంటే ఒకరినొకరు అర్థంచేసుకునేందుకు సమయం కేటాయించాల్సిందేనని, అపార్థాలుంటే పరిష్కరించుకోవాలి కానీ గొడవలు పడి విడిపోవడం కరెక్ట్ కాదని ఈ సినిమాలో చూపిస్తున్నాం. బరువు బాధ్యతలు లేని ఇద్దరబ్బాయిలు, జీవితంలో నిర్దిష్టమైన లక్ష్యాలున్న ఇద్దరు అమ్మాయిలు మధ్య ఈ కథ సాగుతుంది. నిజజీవితంలో నేను చేసిన సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది ఈ కథ రాసుకున్నా. దర్శకుడిగా ఇదే నా తొలి చిత్రం. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని ఈ సినిమా మెప్పిస్తుందనే నమ్మకముంది’ అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

