Sai Pallavi | మరో సెన్సేషనల్ పాటతో రానున్న సాయిపల్లవి..!
నటనతోపాటు డ్యాన్స్ తోనూ ఆకట్టుకునే టాలెంట్ సాయిపల్లవి (Sai Pallavi). సొంతం. ఇటీవలే విడుదలైన లవ్‌స్టోరీ చిత్రంలో సారంగదరియా (Saranga Dariya) పాటనైతే ఏకంగా మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ..క్లాస్, మాస్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది.

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది కోలీవుడ్ భామ సాయిపల్లవి (Sai Pallavi). నటనతోపాటు డ్యాన్స్ తోనూ ఆకట్టుకునే టాలెంట్ ఈ భామ సొంతం. ఇప్పటికే ఫిదా చిత్రంలో వచ్చిండే పిల్లా మెల్లగా వచ్చిండే అంటూ ఇరగదీసే స్టెప్పులేసి అదరహో అనిపించింది. ఇటీవలే విడుదలైన లవ్‌స్టోరీ చిత్రంలో సారంగదరియా (Saranga Dariya) పాటనైతే ఏకంగా మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ..క్లాస్, మాస్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది.
అయితే సాయిపల్లవి మరోసారి సారంగదరియా లాంటి పాటతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందా..? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇంతకీ ఏ సినిమాలో అనే కదా మీ డౌటు. నాని హీరోగా నటిస్తోన్న చిత్రం శ్యామ్‌సింగరాయ్ (Shyam Singha Roy). సాయిపల్లవి వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. అయితే సాయిపల్లవి డ్యాన్సింగ్ టాలెంట్‌ను శ్యామ్‌సింగరాయ్ సినిమా కోసం వాడుకోవాలని మేకర్స్ ఫిక్స్ అయినట్టు టాక్ నడుస్తోంది.
నవరాత్రి వేడుక నేపథ్యంలో ఓ స్పెషల్ సాంగ్‌ను శ్యామ్ సింగరాయ్‌లో పెట్టాలని ప్లాన్ చేస్తున్నారన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ చిత్రంలో బెంగాళీ యువతి పాత్రలో కనిపించనుంది సాయిపల్లవి. నవరాత్రి బ్యాక్ డ్రాప్లో రాబోయే ఈ పాటను అత్యంత భారీ స్థాయిలో సినిమాకే హైలెట్‌గా నిలిచేలా రూపొందించనున్నారట. మొత్తానికి సాయిపల్లవి త్వరలోనే మరో సెన్సేషనల్ పాటతో రికార్డుల వేట మొదలుపెట్టడం ఖాయమనే అనిపిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Samantha: నాగచైతన్య కోసం సమంత ఇన్ని త్యాగాలు చేసిందా?
Samantha | హీరో కోసం చూస్తున్న సమంత..!
samantha | కండీషన్స్ పెడుతున్న సమంత.. వాటికి ఓకే అంటేనే సినిమాకు సై..
Preetham: ఆగని మాటల దాడి.. చైతూ స్పందించాలని కోరుతున్న సమంత స్టైలిస్ట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

