Sai Pallavi | జపాన్‌లో ఊరమాస్ స్టెప్పులతో అదరగొట్టిన సాయి పల్లవి.. వీడియో
Sai Pallavi | బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ (Amir khan) కుమారుడు జునైద్ ఖాన్ (Junaid Khan) హీరోగా ఎంట్రి ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ నటి సాయి పల్లవి కథనాయికగా నటిస్తుంది. ప్రేమకథతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సునీల్‌పాండే దర్శకత్వం వహిస్తున్నాడు.
Sai Pallavi | బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ (Amir khan) కుమారుడు జునైద్ ఖాన్ (Junaid Khan) హీరోగా ఎంట్రి ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ నటి సాయి పల్లవి కథనాయికగా నటిస్తుంది. ప్రేమకథతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సునీల్‌పాండే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి ‘ఏక్ దిన్’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. యశ్‌రాజ్ ఫిలింస్ బ్యానర్లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం జపాన్‌లో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ జపాన్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఇక జపాన్ షెడ్యూల్ పూర్తి అవ్వడంతో టీమ్ అంతా కలిసి పార్టీ చేసుకున్నారు. ఇక ఈ పార్టీలో సాయిపల్లవి తన మాస్ స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
జపాన్‌లో ప్రతి సంవత్సరం జరిగే సపోరో స్నో(Sapporo snow festival) ఫెస్టివల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Actress Sai Pallavi dances at “EK din” Japan Wrap up schedule party..! #SaiPallavi #Japan #Aamirkhan #Ekdin #Japanschedule #wrapupparty #junaidkhan pic.twitter.com/AAtZCOxnRS
— Pooja Suniramana (@PoojaSuniramana) March 9, 2024
సాయి పల్లవి మరోవైపు తెలుగులో నాగచైతన్యతో కలిసి తండేల్ సినిమా చేస్తుంది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా గ్లింప్స్ చివర్లో పల్లెటూరి పదహరాణాల తెలుగు అమ్మాయిగా సాయి పల్లవి కనిపించి యూత్ ను సంబురాల్లో మునిగిపోయేలా చేసింది. ఇదికాకుండా తమిళంలో శివకార్తికేయన్ తో కలిసి యాక్షన్ డ్రామా సినిమా చేస్తుంది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

