Sai Dharam Tej | సాయిధరమ్ తేజ్ షూటింగ్ లో పాల్గొనేది ఎప్పుడంటే..?
టాలీవుడ్ (Tollywood) హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) త్వరలోనే కలుద్దాం అంటూ ఆస్పత్రి నుంచి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్ తో ఆనందంలో మునిగితేలుతున్నారు మెగా అభిమానులు.

టాలీవుడ్ (Tollywood) హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) త్వరలోనే కలుద్దాం అంటూ ఆస్పత్రి నుంచి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్ తో ఆనందంలో మునిగితేలుతున్నారు మెగా అభిమానులు. సాయిధరమ్ తేజ్ ఆస్ప్రత్రిలో చేరి దాదాపు నెల కావొస్తుంది. అయితే ఆస్పత్రిలో చేరిన తర్వాత తొలిసారి థంబ్స్ అప్ సింబల్ ను ట్విటర్ లో పోస్ట్ చేస్తూ..తన ఆరోగ్యం కుదుట పడినట్టు స్పష్టత ఇచ్చాడు. దీంతో మరి సాయిధరమ్ తేజ్ ఇప్పట్లో షూటింగ్ లో పాల్గొంటాడా..? లేదా..? సమయం పడుతుందా..? అంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త ఫిలింనగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. సాయిధరమ్ తేజ్ నవంబర్ నుంచే చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడట. మిస్టికల్ థ్రిల్లర్ గా రాబోతున్న చిత్ర షూటింగ్ లో నవంబర్ మొదటి వారం నుంచే పాల్గొంటాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని సుకుమార్, బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించనున్నారు.
కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu) ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలపై త్వరలోనే స్పష్టత రానుంది. దేవాకట్టా డైరెక్షన్ లో సాయిధరమ్ నటించిన రిపబ్లిక్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు రాగా..బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది.
ఇవి కూడా చదవండి..
Faria abdullah: రోడ్డుపై జాతి రత్నాలు బ్యూటీ తీన్మార్ డ్యాన్స్.. వీడియో వైరల్
MAA Elections | ‘మా’ ఎన్నికలపై నటుడు రవిబాబు సంచలన వ్యాఖ్యలు
Chiranjeevi | గర్వంగా చెబుతున్నా అది నా సొంత డబ్బు: చిరంజీవి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

