టాలీవుడ్ యువ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ విరూపాక్ష (Virupaksha). కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వంలో SDT15వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. కాగా మేకర్స్ ఇవాళ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.సాయిధరమ్ తేజ్ జీప్‌పై కూర్చుని ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్న స్టిల్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఇప్పటికే విడుదలైన విరూపాక్ష టైటిల్ గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. విరూపాక్ష తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విరూపాక్షలో మలయాళ భామ సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ మూవీకి కాంతార ఫేం అంజనీశ్ లోక్‌నాథ్ మ్యూజిక్ డైరెక్టర్. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌పై సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు అంజనీశ్ లోక్‌నాథ్.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్రహ్మాజీ, అజయ్, సునీల్ విరూపాక్షలో కీలక పాత్రలు నటిస్తున్నారు. విరూపాక్షతోపాటు సాయిధరమ్ తేజ్ మరోవైపు సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సీతమ్ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. పవన్ కల్యాణ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
Team #Virupaksha sends out Ugadi wishes with breezy and stylish poster of Supreme Hero @IamSaiDharamTej 🤩🥳@iamsamyuktha_ @karthikdandu86 @AJANEESHB @Shamdatdop @BvsnP @aryasukku @bkrsatish @NavinNooli @SVCCofficial @SukumarWritings#VirupakshaOnApril21st pic.twitter.com/U6wNgilTGI
— BA Raju's Team (@baraju_SuperHit) March 22, 2023
నటిస్తున్నారు.
విరూపాక్ష తెలుగు టైటిల్ గ్లింప్స్ వీడియో..
రిస్కీ బైక్ స్టంట్ గ్లింప్స్ వీడియో..