శివకుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఎమోషనల్ డ్రామా ‘సహా’(లైఫ్ ఆఫ్ సంజు). నిశాంత్ దోటి దర్శకుడు. తేజ వెల్పుచర్ల నిర్మాత. సెప్టెంబర్ 4న థియేటర్లలో సినిమా విడుదల కానున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ శనివారం మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్లో హీరోహీరోయిన్లు శివకుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్ మెట్రో రైల్లో ప్రయాణిస్తూ ఆత్మీయంగా కనిపిస్తున్నారు.
వీరిద్దరి పాత్రల మధ్య ఉన్న ప్రేమబంధాన్ని ఆవిష్కరించేలా ఈ స్టిల్ ఉన్నది. ప్రేమ, అనుబంధాలు, జ్ఞాపకాలు, భావోద్వేగాల సంఘర్షణల చుట్టూ సాగే ఎమోషనల్ డ్రామా ఈ సినిమా అని మేకర్స్ తెలిపారు. వ్రజనా పాండ్యా, మహిపాల్, అప్పాజీ, భారతీ, మేఘన, తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: కరుణాకర్.కె, సంగీతం: శేఖర్‌చంద్ర, నిర్మాణం: సుమైరా స్టూడియోస్.