Salaar | ప్రభాస్ (Prabhas) ‘సలార్’ పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. డిసెంబర్ 22 కోసం ఎదురుచూస్తున్న అభిమానుల అంచనాలని మరింతగా పెంచేస్తూ.. ఈ చిత్రంపై ఇప్పుడు ఓ బిగ్గెస్ట్ రూమర్ వినిపిస్తుంది. సలార్ (Salaar), క్రేజీఎఫ్కి లింక్ వుందని ఇప్పటికే కథనాలు వచ్చాయి. టీజర్ లో కూడా కొన్ని పోలికలు కనిపించాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ యూనివర్స్ తో ముడిపెడుతూ సలార్ కథని రాసుకున్నారని వినిపించింది.
ఇందులో వాస్తవం ఏమిటో కానీ ఇప్పుడు మరో క్రేజీ రూమర్ బయటికి వచ్చింది. సలార్ ఎండింగ్ కార్డ్ కి ముందు ఎవరూ ఊహించని ఓ ఎపిసోడ్ ని ప్లాన్ చేశాడట నీల్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, యష్ ఈ ఎపిసోడ్ లో కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నారు. ఆయన సినిమాటిక్ యూనివర్స్ లోకి యష్ తో పాటు ఎన్టీఆర్ ని కూడా తీసుకొచ్చేలా ఈ ఎపిసోడ్ ని డిజైన్ చేస్తున్నారని, ఐతే చివరివరకూ దీనిపై ఎలాంటి ప్రకటన చేయరని అంటున్నారు.
ఒకవేళ ఇదే నిజమైతే సలార్ సెకండ్ పార్ట్ పై అంచనాలు నెక్స్ట్ లెవల్ లో వుంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
సలార్ టీజర్..