అనిల్, విభీష, రియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రుద్రంకోట’. రాము కోన దర్శకత్వంలో అనిల్ కండవల్లి నిర్మిస్తున్నారు. ఈ నెల 22న విడుదలకానుంది. హీరో, నిర్మాత అనిల్ కండవల్లి చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘భద్రాచలం దగ్గరలోని రుద్రంకోట అనే ఊరి నేపథ్యంలో జరిగే కథ ఇది.
శ్మశాన వాటికలో పెరిగి పద్దైన ఓ యువకుడి జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని సరికొత్త పాయింట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అన్నారు. జయలలిత, అలేఖ్య, రమ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సంజీవ్, సంగీతం: సుభాష్ ఆనంద్, నిరంజన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాము కోన.