Rudrudu Movie Telugu Rights | ముప్పై ఏళ్ల క్రీతం ‘ముఠా మేస్త్రీ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి కొరియోగ్రాఫర్‌గా పరిచయమయ్యాడు రాఘవలారెన్స్. ‘ఈ పేటకు నేనే మేస్త్రీ’ అనే సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు కంపోజ్ చేసి తొలి పాటతోనే అందరితో విజిల్స్ వేయించుకున్నాడు. ఆ తర్వాత వరుస ఆఫర్లతో టాలీవుడ్లో తిరుగులేని కొరియోగ్రాఫర్‌గా మారాడు. ఇదే క్రమంలో మెగాఫోన్ చేతబట్టి ‘మాస్’ సినిమాతో దర్శకుడి రూపం ఎత్తాడు. అక్కినేని అభిమానులకు మరిచిపోలేని హిట్టిచ్చాడు. ఆ తర్వాత హీరోగాను అవతారమెత్తి ‘స్టైల్’తో విజయ పరంపర కొనసాగించాడు. అయితే ‘కాంచనా’ సిరీస్‌తో లారెన్స్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.
రొటీన్ కథలే అయినా బీ, సీ సెంటర్లలో కనక వర్షాలు కురిసాయి. బయ్యర్లకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెట్టాయి. దాంతో లారెన్స్ సినిమాలకు తెలుగులో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇక ఇప్పుడదే ‘రుద్రుడు’ సినిమాకు కలిసి వచ్చింది. లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా హార్రర్ నేపథ్యంలోనే తెరకెక్కింది. కథిరేషన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా డబ్బింగ్ హక్కులకు భారీ ధర పలికినట్లు తెలుస్తుంది. టాలీవుడ్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం ఈ సినిమా హక్కులు ఆరున్నర కోట్లకు పైమాటే అట. నిజానికి ఇది భారీ మొత్తమే. పైగా గత మూడేళ్లుగా లారెన్స్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. అయినా కానీ ఈ రేటు పలికాయంటే లారెన్స్ క్రేజ్ ఏ మేర ఉందో తెలుస్తుంది.
అయితే ఈ సినిమా గట్టె్క్కాలంటే దాదాపు పన్నెండు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అదంత సులభం మాత్రం కాదు. పోటీగా శాకుంతలం, బిచ్చగాడు-2 వంటి పెద్ద సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలపై కూడా ఇక్కడ విపరీతమైన బజ్ ఉంది. చూడాలి మరి ఈ రెండు సినిమాలతో పోటీను తట్టుకుని లారెన్స్ నిలుస్తాడో లేదో అని. నిజానికి ఈ సినిమా గతేడాడి డిసెంబర్లోనే రావాల్సి ఉంది. కానీ షూటింగ్ కాస్త లేటవడంతో పోస్ట్ పోన్ అయింది.