Ajay Devgn | నా వల్లే ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్.. అజయ్ దేవ్‌గణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Ajay Devgn | ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంలోని ‘నాటు నాటు’ (Natu Natu) పాటకు ఆస్కార్ (Oscar) రావడం పట్ల ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgn) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనవల్లే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఆస్కార్ వచ్చిందని చెప్పుకొచ్చారు.
Ajay Devgn | టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రం రిలీజై ఏడాది పూర్తైంది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఈ చిత్రం.. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఇటీవలే ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ (Natu Natu) పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ (Best Original Song category)లో ఆస్కార్ (Oscar) వరించింది. కాగా, ఈ పాటకు ఆస్కార్ (Oscar) రావడం పట్ల ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgn) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంలో అజయ్‌దేవ్‌గణ్ (Ajay Devgn) కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. రామ్‌చరణ్ (Ramcharan) తండ్రిగా కనిపించారు. ప్రస్తుతం ఆయన ‘భోళా’ చిత్రంలో నటిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా కామెడీ రియాలిటీ షో ‘ది కపిల్ శర్మ షో’ (The Kapil Sharma Show)కు హాజరయ్యారు. ఈ సందర్భంగా కపిల్ శర్మ.. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడం పట్ల అజయ్‌ను ప్రశ్నించారు.
‘మీరు నటించిన సినిమాకు ఆస్కార్ రావడం ఎలా అనిపించింది..?’ అని కపిల్ ప్రశ్నించగా.. తనవల్లే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఆస్కార్ వచ్చిందంటూ అజయ్ సమాధానం ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా షాకైన కపిల్.. అదెలా..? అని అడిగారు. ‘నాటు నాటు’ పాటలో తాను డ్యాన్స్ చేయలేదు కాబట్టి ఆస్కార్ అవార్డు వచ్చింది అంటూ నవ్వులు పూయించారు. ‘‘నాటు నాటు’ పాటలో నేను డ్యాన్స్ చేసి ఉంటే పరిస్థితేంటి..? నా డ్యాన్స్ చూసి అకాడమీ జ్యూరీ మెంబర్స్ ఆస్కార్ ఇచ్చే వారు కాదు. నేను డ్యాన్స్ చేయకపోవడం వల్లే ఆ పాటకు ఆస్కార్ వచ్చింది’ అంటూ తనపైనే సెటైర్ వేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://twitter.com/Pooran_marwadi/status/1639179603729317888?s=20
Also Read..
Siddaramaiah | త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. కొడుకు స్థానం నుంచి పోటీకి సిద్ధమైన సిద్ధరామయ్య
Kushboo Sundar | రాహుల్‌కు జైలు శిక్ష.. మోదీ ఇంటిపేరుపై ఖుష్బూ చేసిన పాత ట్వీట్ వైరల్
Ravanasura Movie | రావణాసుర ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ajay devgn
- natu natu
- Oscar
- RRR
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

