Sudarshan 35mm | సింగిల్ థియేటర్లో రూ.5 కోట్లు గ్రాస్..ఆర్ఆర్ఆర్ అరుదైన రికార్డు
ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం రికార్డులను సృష్టించింది ఆర్ఆర్ఆర్ (RRR). సినిమా వచ్చి 50 రోజులవుతున్నా బాక్సాపీస్ వద్ద తన హవా కొనసాగిస్తోంది ఆర్ఆర్ఆర్.
ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), రాంచరణ్ (Ram Charan), జూ..ఎన్టీఆర్ (Jr NTR) సూపర్ హిట్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం రికార్డులను సృష్టించింది. సినిమా వచ్చి 50 రోజులవుతున్నా బాక్సాపీస్ వద్ద తన హవా కొనసాగిస్తోంది ఆర్ఆర్ఆర్. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాలా రికార్డులను అధిగమించిన ఆర్ఆర్ఆర్ ఖాతాలో గ్లోబల్ బాక్సాపీస్ వద్ద రూ.1000 కోట్లు గ్రాస్ సాధించిన మూడో సినిమాగా ఇప్పటికే రికార్డు ఉంది. ఇపుడు మరో ల్యాండ్ మార్క్ సొంతం చేసుకుంది.
హైదరాబాద్‌లో ఓ సింగిల్ థియేటర్లలో రూ.5 కోట్లు గ్రాస్ సాధించింది. ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ (RTC X Roads) లోని సుదర్శన్ 35ఎంఎం థియేటర్ (Sudarshan 35mm)లో రూ.5 కోట్లు గ్రాస్ సాధించిన తొలి సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. అంతేకాదు ఒకే థియేటర్లలో రూ.4 కోట్లకుపైగా గ్రాస్ సాధించిన మొట్టమొదటి సినిమాగా రికార్డుల్లోకెక్కింది ఆర్ఆర్ఆర్. నిజంగా ఇది ఓ ఇంక్రెడిబుల్ సినిమా సాధించిన ఇంక్రెడిబుల్ ఫీట్ అని అభివర్ణిస్తున్నారు సినీ విశ్లేషకులు.
కేజీఎఫ్ చాఫ్టర్ 2 లాంటి పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయినా,ఆర్ఆర్ఆర్ మాత్రం బాక్సాపీస్ వద్ద తన రేంజ్‌ను మాత్రం తగ్గనివ్వడం లేదు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. పీరియాడిక్ డ్రామా బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, కొమ్రంభీంగా ఎన్టీఆర్ యాక్టింగ్‌కు అభిమానులు, మూవీ లవర్స్ ఫిదా అయిపోతున్నారు.
Read Also : Ante Sundaraniki | నాని అభిమానులకు మేకర్స్ సర్ప్రైజ్.. ‘ఎంత చిత్రం’ ప్రోమో విడుదల!
Read Also : Faria Abdullah | క్రేజీ అప్డేట్.. ‘బిచ్చగాడు’ హీరోతో ‘జాతిరత్నాలు’ హీరోయిన్..!
Read Also : Poonam Kaur | వాళ్లిద్దరు నా పిల్లలు కాదు..ట్రోల్స్ పై పూనమ్‌కౌర్ క్లారిటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- RRR
- RTC X Roads
- Sudarshan 35mm
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

