టాలీవుడ్లో ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు.
సంక్రాంతి కానుకగా చిత్రాన్ని జనవరి 7న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేస్తున్నారు. ఈ మెగా మల్టీ స్టారర్ చిత్రం అనౌన్స్ అయ్యి సరిగ్గా ఈరోజుతో నాలుగేళ్లు కంప్లీట్ చేసుకుంది అని ఓ ఆసక్తికర పోస్ట్‌తో తెలియజేసింది ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం.
సరిగ్గా నాలుగేళ్ల కిందట అంటే 2017లో రాజమౌళి ఈ పిక్ పెట్టి ఎన్నో ఊహాగానాలకు నాంది పలికారు. సినిమా మొదలు పెట్టి 3 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 50 రోజుల్లో ఈ సినిమా మ్యాజిక్ ని రిలీజ్ చెయ్యడానికి రెడీ చేస్తున్నాం అని ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఫోటోతో పాటు పోస్ట్ కూడా వైరల్‌గా మారింది.ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10000 స్క్రీన్లలో విడుదల అవుతుందని తెలుస్తోంది. ఇదే జరిగితే ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో బిగ్గెస్ట్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీతో పాటుగా పలు విదేశీ భాషల్లో విడుదల కానుంది.