Rowdy Janardhana | టాలీవుడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి రాహుల్ సంకీర్త్యన్‌తో చేస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా. విజయ్ మరోవైపు దిల్ రాజు నిర్మాణంలో రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ రూరల్ మాస్ డ్రామాకు కమిటవగా.. ఈ చిత్రానికి రౌడీ జనార్ధన అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో గ్రాండ్ స్కేల్లో ఉండబోయే యాక్షన్ సీక్వెన్స్‌ను విజయ్ టీం డిజైన్ చేస్తుందట. ముంబై స్లమ్స్ ఏరియాలో రాబోయే హై ఆక్టేన్ ఫైట్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్‌గా నిలువబోతుందట. ఇంటెన్స్, రియలిస్టిక్ యాక్షన్ ఎక్స్పీరియన్స్ అందించేలా ఈ ఎపిసోడ్ ఉండనుందిని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే విజయ్ దేవరకొండ ట్రాన్స్ఫార్మేషన్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తుంది.
రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రియల్ మాస్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రంలో విజయ్ పాత్ర పేరు జనార్ధన్ కాగా, ఆయన నాన్న పేరు కూడా జనార్థనేనని ఇన్సైడ్ టాక్. విజయ్ దేవరకొండకు ‘రౌడీ’ అనే ట్యాగ్ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు రౌడీ టైటిల్‌తో సినిమా వస్తుండడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాతో విజయ్ తన విశ్వరూపం చూపించనున్నాడని కామెంట్ చేస్తున్నారు.
Mangli | మైక్రో ఫైనాన్స్ మోసాలపై సింగర్ మంగ్లీ క్లారిటీ.. నా పేరుతో డబ్బులు వసూలు చేస్తే నమ్మోద్దు..