Roshan Meka | రెండో సినిమాకే సెన్సేషనల్ స్టోరీ..రోషన్ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా..?
గతేడాది పెళ్లి సందD సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు ఈ కుర్రాడు. దాదాపు 8 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు కూడా లాభాలు తీసుకొచ్చింది. ఈ మధ్య ఆయన పుట్టిన రోజు సందర్భంగా రెండో సినిమాకి సంబంధించిన అధికారిక సమాచారం బయటకు వచ్చింది.
శ్రీకాంత్ తనయుడు రోషన్ (Roshan Meka) రెండో సినిమాకు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. గతేడాది పెళ్లి సందD సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు ఈ కుర్రాడు. రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. దాదాపు 8 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు కూడా లాభాలు తీసుకొచ్చింది. దాంతో రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు రోషన్. ఈ మధ్య ఆయన పుట్టిన రోజు సందర్భంగా రెండో సినిమాకి సంబంధించిన అధికారిక సమాచారం బయటకు వచ్చింది.
ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం (Pradeep Advaitam) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అద్వైతం షార్ట్ ఫిలింతో ఈయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రోషన్ సినిమాతో ఇండస్ట్రీకి వస్తున్నాడు. ఈ సినిమా స్వాతంత్రానికి పూర్వం కథతో రాబోతుందని తెలుస్తోంది. ఇందులో రోషన్ తన వయసుకు మించిన పాత్రలో కనిపించబోతున్నాడు. గన్స్ ప్రధానంగా సాగే ఈ కథ మొత్తం ప్రీ ఇండిపెండెన్స్ నేపథ్యంలోనే వస్తోంది. ఇందులో గన్ డీలర్ పాత్రలో రోషన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also : RRR Hindi collections | ఆర్ఆర్ఆర్ ఫస్ట్ వీకెండ్ హిందీ కలెక్షన్ల సంగతేంటి..!
పెళ్లి సందD (Pelli SandaD) సినిమా లో చాలా క్యూట్ గా లవర్ బాయ్ గా కనిపించిన ఆయన. రెండో సినిమాకే ఏకంగా మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అంతేకాదు ప్రదీప్ అద్వైతం సినిమాలో మరో సెన్సేషనల్ పాయింట్ కూడా ఉంది. ఈ సినిమా క్లైమాక్స్ లో హీరో చనిపోతాడు అనే న్యూస్ కూడా వస్తుంది. సినిమా ఎంత అద్భుతంగా ఉన్నా కూడా క్లైమాక్స్ లో హీరో చనిపోతే మన ప్రేక్షకులు ఒప్పుకోవడం కష్టం. గతేడాది సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన రిపబ్లిక్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది.
సినిమా అంతా బాగానే ఉంటుంది కానీ క్లైమాక్స్ లో హీరో చనిపోతాడు. ఇది సినిమా ఫలితంపై దారుణమైన ప్రభావం చూపించింది. ఇలాంటి సమయంలో ఇప్పుడు రోషన్ తన రెండో సినిమాకే రిస్క్ ఉన్నకథ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎలాంటి ఫలితం అందుకోబోతుందో చూడాలి.
Read Also : RRR Telugu Subtitles | సినిమా అర్థం కావట్లేదు..సబ్ టైటిల్స్ కావాలి రాజమౌళిగారు..!
Read Also : Nazriya Fahadh | లీలా థామస్, వివేక్‌ను చాలా మిస్సవుతున్నా..నాని భామ ఎమోషనల్ పోస్ట్
Read Also : Alia Bhatt | మౌనంగా ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియాభట్..ఇంతకీ కారణమేంటో ?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

