అగ్ర దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతున్న ప్రేమకథ ‘రోమాంచకం’. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా వేణుగోపాల్‌రెడ్డి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మాత. సెస్టెంబర్ 3న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ప్రచారంలో భాగంగా ఈసినిమాలోని తొలిపాటను మేకర్స్ విడుదల చేశారు.
‘రాధా రమణ రాగాలు మనసున మోగే వేళలో.. ఏదో తపన తాగేసి వయసులు ఊగే వేళలో..’ అంటూ సాగే ఈ పాటను చంద్రబోస్ రాయగా, వాసుకి వైభవ్ స్వరపరిచి, ఆలపించారు. హీరోహీరోయిన్ల మధ్య పొయెటిక్ రొమాంటిక్ ఫీల్‌తో ఈ పాటను చిత్రీకరించినట్టు మేకర్స్ తెలిపారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిసిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇదని వారన్నారు. ఉపేంద్ర లిమాయె, వెంకటేశ్ కాకుమాను, నరేంద్ర రవి, మణి, సోహాన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పవన్ పప్పుల.