Robinhood | టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin), వెంకీ కుడుముల (Venky Kudumula) కాంబోలో వస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్ (Robinhood). భీష్మ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా మంచి ఆదరణ లభించింది. అయితే నేడు శ్రీరామ నవమి సందర్భంగా మూవీ నుంచి విడదల తేదీ అనౌన్స్ చేశారు మేకర్స్.
ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా 2024 డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో రాశీఖన్నాను నాయికగా ఖరారు చేసినట్లు సమాచారం. గతంలో ఈ జంట ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రంలో నటించారు. సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి ఈ జోడీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నది. మరోవైపు ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ కీలకపాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. నితిన్‌కు ఉన్న పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని సంజయ్‌దత్ ఈ సినిమాకు తీసుకున్నట్లు టాక్ నడుస్తుంది.
#Robinhood in cinemas from December 20th, 2024 @actor_nithiin @VenkyKudumula @gvprakash @MythriOfficial pic.twitter.com/bNfkGs1WQQ
— Vamsi Kaka (@vamsikaka) April 17, 2024
నటకిరిటీ రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవి శంకర్ నిర్మి్స్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫర్ కాగా.. ప్రవీణ్ పూడి ఎడిటర్. రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్.