Robinhood OTT | టాలీవుడ్ యువ నటుడు నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం రాబిన్‌హుడ్ (Robinhood). ఈ సినిమాకు వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వం వహించగా భీష్మ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందనలను తెచ్చుకుంది. అయితే ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ 5’ (Zee 5) ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాను ఎలా అయితే అటు ఛానల్లో, ఇటు ఓటీటీలో విడుదల చేసిందో అచ్చం అలానే రాబిన్ హుడ్‌ని కూడా తీసుకురాబోతుంది. రాబిన్‌హుడ్ టీవీ ప్రీమియర్ మే 10న సాయంత్రం 6 గంటలకు ప్రారంభంకాబోతుండగా.. అదేరోజు లేదా.. తర్వాతి రోజు ఓటీటీలోకి విడుదల చేయబోతుంది చిత్రయూనిట్.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అనాధ అయిన రామ్(నితిన్)ని ఓ పెద్దాయన(లాల్) ఓ అనాథ శరణాలయంలో వదిలిపెట్టి వెళ్తాడు. ఆ శరణాలయంలోనే పెరుగుతుంటాడు రామ్. అయితే.. ప్రభుత్వం నుంచి కానీ.. సంపన్నుల నుంచి కానీ ఆ అనాధాశ్రమానికి ఎలాంటి సహకారం రాదు. పేరు ప్రఖ్యాతులు పెంచుకునేందుకు, పబ్లిసిటీ కోసం ఆ శరణాలయాన్నీ.. అందులోని అనాధల్ని అందరూ ఉపయోగించుకునేవారే తప్ప, ఆ అనాథలకు పట్టెడు అన్నం పెట్టే నాథుడే ఉండడు. దాంతో ఆ శరణాలయాన్ని నడపడమే కష్టమై ఇబ్బందులు పడుతుంటాడు వార్డెన్(శుభలేఖ సుధాకర్). ఆ పరిస్థితులన్నీ గమనించిన రామ్.. సాటి అనాధలకు అండగా నిలవాలనుకుంటాడు. దేవుడు అందర్నీ ఒకేలా పుట్టించాడు.. కానీ ఉన్నవారూ, లేనివారు అనే తారతమ్యాలు మాత్రం మనిషే సృష్టించాడు. ఈ అంతరాలు చెరిగిపోవాలి. అందరూ సమానం కావాలి.. అనే ధృక్పధంతో ‘రాబిన్‌హుడ్’గా మారతాడు రామ్. ఎవరికీ తెలీకుండా ఉన్నవాళ్లను కొల్లగొట్టి లేనివాళ్లకు పెట్టడం మొదలుపెడతాడు. తన శరణాలయంతోపాటు కనిపించే ప్రతి పేదవాడికీ అండగా నిలుస్తాడు. అలాగే పెరిగిపెద్దవుతాడు. తన శరణాలయాన్ని కూడా అభివృద్ధి చేస్తాడు. అయితే.. సిటీలో జరుగుతున్న దొంగతనాలకు కారణం రాబిన్‌హుడ్ అని పోలీసులకు తెలుస్తుంది. అయితే.. ఆ రాబిన్‌హుడ్ ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు. అతడ్ని పట్టుకోడానికి ఓ స్పెషల్ డ్యూటీగా వైల్డ్‌డాగ్ అని పిలవబడే ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ని నియమిస్తుంది ప్రభుత్వం. మరి రాబిన్‌హుడ్‌ని ఆ ఆఫీసర్ పట్టుకున్నాడా? అసలు రామ్‌ని శరణాలయంలో వదిలిపెట్టిన ఆ పెద్దాయన ఎవరు? సమాజంలో అంతరాలు తొలగిపోవాలి.. అందరూ సమానంగా బ్రతకాలి అనే సిద్ధాంతం అతని మనసులో నాటుకుపోవడానికి కారణం ఎవరు? కథాక్రమంలో రాబిన్‌హుడ్ చేసిన సాహసాలేంటి? ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
The Big news!
The talk of the town #Robinhood will see you on 10th May @ 6pm
Get Ready!@actor_nithiin @sreeleela14 @VenkyKudumula @gvprakash #RajendraPrasad @vennelakishore @DevdattaGNage #SaiSriram @EditorKoti #RaamKumar @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/jHINGalYnu
— ZEE5 Telugu (@ZEE5Telugu) May 6, 2025