Robinhood | కొన్ని చిత్రాలు థియేటర్స్‌లో అట్లర్ ఫ్లాప్ అయిన ఓటీటీలో మత్రం మంచి రెస్సాన్స్ తెచ్చుకుంటాయి. అలాంటి వాటిలో రాబిన్ హుడ్ చిత్రం కూడా ఒకటి. నితిన్ హీరోగా వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించింది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్రలో కనిపించి అలరించాడు. అయితే భారీ అంచనాల మధ్య థియేటర్స్‌లోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని పెద్దగా అలరించలేకపోయింది. మే10 నుంచి ప్రముఖ ఓటీటీ మాధ్యమం జీ5లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.ప్రేక్షకులు ఉహించలేని గ్రిప్పింగ్ స్టోరీ లైన్‌తో సాగే ఈ చిత్రంలో హై ఓల్టేజ్ యాక్షన్ కూడా ఉండడంతో ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది.
యాభై మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో ‘రాబిన్‌హుడ్’ దూసుకుపోయింది.థియేటర్లో మాస్ ఆడియెన్స్‌ను మెప్పించిన ‘రాబిన్‌హుడ్’ ప్రస్తుతం ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం అలరిస్తుంది.. గత కొన్ని రోజులుగా ‘రాబిన్‌హుడ్’ జీ5లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతుండగా, 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో ఓటీటీలో సరి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ‘రాబిన్‌హుడ్’ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. చిత్ర కథ విషయానికి వస్తే అనాథగా పుట్టి పెరిగిన రామ్.. ఆ తర్వాత రాబిన్ హుడ్ గా మారి ధనవంతుల నుంచి డబ్బులను దొంగిలిస్తూ పేదలకు పంచిపెడుతుంటాడు.
అనుకోని పరిస్థితులలో డ్రగ్స్ మాఫియాతో గొడవపడటంతో రామ్ లైఫ్ మారిపోతుంది. అక్కడి నుంచి రామ్ ఎదుర్కున్న ఉత్కంఠ ఘటనల ఆధారంగా మూవీ సాగుతుంది. తను నీరా (శ్రీలీల)తో కలిసి అత్యంత ప్రమాదకరమైన దొంగతనాలు, ప్రాణాంతకమైన సవాళ్లను ఎదుర్కొనటానికి కూడా రెడీ అవుతాడు.అంతా బాగుందని భావిస్తున్న తరుణంలో కథ అతి పెద్ద ట్విస్ట్ తిరుగుతుంది. అప్పుడు రామ్, నీరా ఏం చేశారు? సమస్య నుంచి ఎలా బయటపడ్డారు? అనే అంశాలు ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా చేస్తాయి.