Thalaivar 170 | తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తోన్న తాజా చిత్రాల్లో ఒకటి తలైవా 170 (Thalaivar 170). జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) దర్శకత్వం వహిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్‌పై సుబాస్కరన్ నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ దుషారా విజయన్ కీలక పాత్రలో నటిస్తోంది. టీంలోకి ఆమెకు స్వాగతం పలుకుతున్నట్టు తెలియజేస్తూ ఇప్పటికే ఓ అప్డేట్ అందించారు మేకర్స్. దుషారా విజయన్ ఇందులో ఎలాంటి పాత్రలో కనిపించబోతుందనేది మాత్రం సస్పెన్స్‌లో పెట్టారు.
మేకర్స్ తాజాగా ఈ మూవీలో నటించే మరో భామకు సంబంధించిన వార్త అందించారు. వెంకటేశ్ టైటిల్ రోల్లో నటించిన గురు ఫేం రితికా సింగ్ ఈ చిత్రంలో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రితికా సింగ్ (Ritika Singh)ను టీంలోకి స్వాగతం పలుకుతూ లైకా ప్రొడక్షన్స్ టీం రిలీజ్ చేసిన తాజా అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. తలైవా 170 2024లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, కోలీవుడ్ బ్యూటీ మంజువారియర్ కీ రోల్స్‌లో నటించబోతున్నారని వార్తలు వస్తుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
జైభీమ్ లాంటి సామాజిక సందేశాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన జ్ఞానవేళ్ మరి సూపర్ స్టార్ రజినీకాంత్‌ను సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి పాత్రలో చూపించబోతున్నాడన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో లాల్‌సలామ్‌లో కూడా నటిస్తున్నాడు తలైవా. ఈ మూవీ పొంగళ్ 2024 కానుకగా విడుదల కానుంది. రజినీకాంత్ మరోవైపు తలైవా 171 (Thalaivar 171)కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (lokesh-kanagaraj) ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.
తలైవా 170లో రితికా సింగ్
Welcoming the bold performer 🤨 Ms. Ritika Singh ✨ on board for #Thalaivar170🕴🏼#Thalaivar170Team has gotten grittier 💪🏻 with the addition of @ritika_offl 🎬🤗🌟@rajinikanth @tjgnan @anirudhofficial @officialdushara @RIAZtheboss @V4umedia_ @gkmtamilkumaran @LycaProductions… pic.twitter.com/QN3AWAhOd7
— Lyca Productions (@LycaProductions) October 2, 2023
దుషారా విజయన్‌కు వెల్కమ్..
Welcoming the talented actress Ms. Dushara Vijayan ✨ on board for #Thalaivar170🕴🏼#Thalaivar170Team has gotten stronger with the addition of the wonderful @officialdushara 🎬🤗🌟@rajinikanth @tjgnan @anirudhofficial @RIAZtheboss @V4umedia_ @gkmtamilkumaran @LycaProductions… pic.twitter.com/s1dXzNpGBr
— Lyca Productions (@LycaProductions) October 2, 2023
#Thalaivar170 Casting Buzz🔥
– AmitabhBachchan ✅
– Nani
– FahadhFaasil
– ManjuWarrior
Along with Superstar #Rajinikanth🌟Seems TJGnanavel is making something bigger this time 💯💥 pic.twitter.com/yW5geJjcZ1
— AmuthaBharathi (@CinemaWithAB) August 4, 2023