Rishab Shetty | అలా చేయడం బాధాకరం.. ఇఫి వేడుకల్లో ఓటీటీ సంస్థలపై అసంతృప్తి వ్యక్తం చేసిన రిషబ్ శెట్టి
Rishab Shetty | ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ (OTT platforms)పై కన్నడ యాక్టర్ రిషబ్‌శెట్టి (Rishab Shetty) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటీటీ సంస్థలు వ్వవహరిస్తున్న విధానం బాధాకరమన్నారు.
Rishab Shetty | ‘కాంతార’ (Kantara) సినిమాతో టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలిచాడు కన్నడ యాక్టర్ రిషబ్‌శెట్టి (Rishab Shetty). ఈ టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ తెరకెక్కించిన ‘కాంతార’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రిషబ్ శెట్టి దర్శకత్వంలో ‘కాంతార’ ప్రీక్వెల్‘కాంతార చాప్టర్ -1 (Kantara: Chapter 1) రాబోతున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా రిషబ్ శెట్టి గోవా (Goa)లో జరుగుతున్న 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2023 ( 54th International Film Festival of India 2023)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ (OTT platforms)పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటీటీ సంస్థలు వ్వవహరిస్తున్న విధానం బాధాకరమన్నారు.
‘ఎన్ఎఫ్డీసీ ఫిల్మ్ బజార్‌లాంటి వేడుకల్లో ప్రదర్శితమైతే కన్నడ చిత్రాలకు రెవన్యూ వచ్చేది. కొవిడ్ సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వినియోగం పెరగడంతో ఆ పరిస్థితి లేదు. కన్నడలో తెరకెక్కిన ఓ కమర్షియల్ సినిమా సక్సెస్ కాలేదని ఓటీటీ సంస్థలు కన్నడ చిత్రాలన్నింటినీ తిరస్కరించడం చాలా బాధాకరం’ అని అన్నారు. కన్నడ చిత్రాలకు గుర్తింపు ఇవ్వాలని ఈ సందర్భంగా ఇఫి (IFFI) స్పాన్సర్లను కోరారు.
ఇక ఇదే వేదికపై తాను కన్నడ చిత్ర పరిశ్రమను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ‘ఒక్క హిట్‌తో ఇతర నటుల్లా నేను కన్నడ చిత్రపరిశ్రమను వదిలిపెట్టాలనుకోవడం లేదు. కాంతార తర్వాత నాకు ఇతర చిత్ర పరిశ్రమల నుంచి అవకాశాలు వచ్చాయి. కానీ, నేను వాటిని సున్నితంగా తిరస్కరించాను. కన్నడ ప్రేక్షకులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. కంటెంట్ బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రస్తుతం దృష్టంతా కాంతార చాఫ్టర్ 1పైనే పెట్టాం. కాంతార తీసే సమయంలోనే ప్రీక్వెల్ ఆలోచన వచ్చింది. మూవీ హిట్ కావడంతో ఇప్పుడు చాప్టర్ 1 ను మొదలు పెట్టాం’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా, ఇఫి వేడుకల్లో ‘కాంతార’ చిత్రానికి సిల్వర్ పీకాక్ అవార్డు దక్కింది. ఈ పురస్కారం దక్కించుకున్న తొలి కన్నడ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
Also Read..
Bigg Boss 7 Telugu | బిగ్ బాస్ వన్ సైడ్ గేమ్ ఆడుతున్నాడా.. వాళ్లను కాపాడుతున్నాడా..?
Kantara Chapter 1 | క్రేజీ టాక్.. కాంతార చాప్టర్ 1లో 15 మంది పాపులర్ యాక్టర్లు..!
Lokesh Kanagaraj | కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించిన లోకేష్ కనగరాజ్.. పేరు ఏంటో తెలుసా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

