Kantara Chapter 1 | క్రేజీ టాక్.. కాంతార చాప్టర్ 1లో 15 మంది పాపులర్ యాక్టర్లు..!
Kantara Chapter 1 | టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి దర్శకత్వంలో కాంతార ప్రీక్వెల్‌గా వస్తుంది ‘కాంతార చాప్టర్ -1 (Kantara: Chapter 1). కాంతార చాఫ్టర్ 1 ఫస్ట్ లుక్‌తోపాటు టీజర్ కూడా విడుదల చేసింది. కాంతారను మించిన విజువల్స్ బాక్సాఫీస్ వద్ద మోత మోగించడం ఖాయమని టీజర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు రిషబ్ శెట్టి (Rishab Shetty).
Kantara Chapter 1 | ‘కాంతార’ (Kantara) సినిమాతో టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలిచాడు కన్నడ యాక్టర్ రిషబ్‌శెట్టి. ఈ టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ తెరకెక్కించిన కాంతార బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. కాగా ఇప్పుడు రిషబ్ శెట్టి దర్శకత్వంలో కాంతార ప్రీక్వెల్‌గా వస్తుంది ‘కాంతార చాప్టర్ -1 (Kantara: Chapter 1). కాంతార చాఫ్టర్ 1 ఫస్ట్ లుక్‌తోపాటు టీజర్ కూడా విడుదల చేసింది. కాంతారను మించిన విజువల్స్ బాక్సాఫీస్ వద్ద మోత మోగించడం ఖాయమని టీజర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు రిషబ్ శెట్టి (Rishab Shetty).
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో వివిధ ఇండస్ట్రీల నుంచి 15 మంది పాపులర్ యాక్టర్లు కనిపించబోతున్నారన్న వార్త ఇప్పుడు మూవీ లవర్స్‌ను ఎక్జయిటింగ్‌కు లోను చేస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ నుంచి 15 మంది యాక్టర్లను తీసుకోబోతున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే కాంతార చాఫ్టర్ 1 ఘనవిజయం సాధించడం ఖాయమైపోయినట్టేనంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ప్రస్తుతానికి ఇది గాసిప్ మాత్రమే అయినా ఈ వార్తను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు సినీ జనాలు.
తొలిపార్టును రూ.16 కోట్లలోపే తెరకెక్కించిన రిషబ్ శెట్టి.. ప్రీక్వెల్ కోసం రూ.120 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. రిషబ్ శెట్టి టీం ఒక్క ప్రీ ప్రొడక్షన్ కోసమే రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు జోరుగా టాక్ నడుస్తోంది. హొంబలే ఫిల్స్మ్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదల చేయనున్నారు. మొత్తానికి విడుదలకు ముందే కొత్త కొత్త అప్డేట్స్తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది కాంతార చాఫ్టర్ 1.
కాంతార చాఫ్టర్ 1 టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MCD: కాలుష్యంపై చర్చ.. ఢిల్లీ మున్సిపల్ సమావేశాల్లో గందరగోళం
‘ప్రజా వీరుడు పండుగ సాయన్న’
కాచారంలో తక్షణమే మైనింగ్ తవ్వకాలు ఆపాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

