Kantara Chapter 1 | ‘బాహుబలి’ని బీట్ చేసిన రిషభ్ శెట్టి ‘కాంతార చాఫ్టర్ 1’
Rishab Shetty | కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార చాఫ్టర్ 1 (Kantara: Chapter 1) చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
Rishab Shetty | కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార చాఫ్టర్ 1 (Kantara: Chapter 1) చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రూ.500 కోట్లను అలవోకగా దాటిన ఈ చిత్రం ప్రస్తుతం రూ.650 కోట్ల క్లబ్లో చేరింది. ఈ సందర్భంగా కాంతార అరుదైన మైలురాయిని అందుకుంది. ఈ సినిమా రూ.650 కోట్ల దాటడంతో బాహుబలి పార్ట్ 1 మీద ఉన్న రికార్డును ఈ సినిమా అధిగమించింది. బాహుబలి-ది బిగినింగ్ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.650 కోట్ల వసూళ్లను సాధించగా.. ఈ రికార్డును చెరిపివేస్తూ.. కాంతార రూ.675 కోట్లతో దూసుకుపోతుంది. దీంతో దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-20 చిత్రాల్లో కాంతార 17వ స్థానానికి ఎగబాకింది. 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో రెండో ప్లేస్ దక్కించుకుంది.
ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలను చూసుకుంటే.!
1. దంగల్ (రూ.1,900–2,200 కోట్లు)
2. బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (రూ.1810 కోట్లు)
3. పుష్ప 2: ది రూల్ (రూ.1800 కోట్లు)
4. ఆర్ఆర్ఆర్ (రూ.1300 కోట్లు)
5. కెజిఎఫ్: చాప్టర్ 2 (రూ.1250 కోట్లు)
6. జవాన్ (రూ.1148 కోట్లు)
7. పఠాన్ (రూ.1050 కోట్లు)
8. కల్కి 2898ఏడీ (రూ.1050 – రూ.1100 కోట్లు)
9. యానిమల్ (రూ.917 కోట్లు)
10. బజరంగీ భాయిజాన్ (రూ.900 – రూ.967కోట్లు)
11. స్త్రీ 2 (రూ.875కోట్లు)
12. సీక్రెట్ సూపర్‌స్టార్ (రూ.858 – రూ.966 కోట్లు)
13. ఛావా (రూ.809 కోట్లు)
14. పీకే (రూ.769 కోట్లు)
15. రోబో 2.0( (రూ.699 – రూ.800 కోట్లు))
16. గదర్ 2 (రూ.609 కోట్లు – రూ.700 కోట్లు)
17. కాంతార చాఫ్టర్ 1 (రూ.655 కోట్లు)
18. సుల్తాన్ (రూ.623 కోట్లు)
19. సలార్ (రూ.612 కోట్లు – రూ.702 కోట్లు)
20. జైలర్ (రూ.650 కోట్లు)
21 బాహుబలి: ది బిగినింగ్ (రూ.650 కోట్లు)
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

