RGV | రామ్‌గోపాల్‌వర్మ గతంలో ప్రయోగాత్మక చిత్రాల్ని తెరకెక్కించారు. ఆ తర్వాత చిత్ర నిర్మాణంలో ప్రయోగాలు మొదలుపెట్టారు. గతంలో ఓసారి సెల్‌ఫోన్‌తో కూడా సినిమా తీయొచ్చంటూ చర్చకు తెరలేపారు. తాజాగా సినీ నిర్మాణంలో మరో కొత్త పంథాకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ‘యువర్ ఫిల్మ్’ అనే కొత్త కాన్సెప్ట్‌ని తీసుకొచ్చారు.
ప్రజల చేత , ప్రజలకొరకు, ప్రజల కోసం ఎన్నుకున్నదే ప్రజాప్రభుత్వం అన్నట్టుగా ప్రేక్షకుల చేత, ప్రేక్షకుల కొరకు, ప్రేక్షకుల కోసం చేసే సినిమాలే మా ‘యువర్ఫిల్మ్’ ఐడియా అంటున్నారు రామ్‌గోపాల్‌వర్మ. తన వెబ్సైట్ ద్వారా ఓటింగ్ పద్ధతిలో సినిమాకు సంబంధించిన హీరో, హీరోయిన్, డైరెక్టర్లతోపాటు, ప్రధాన టెక్నీషియన్స్ అందర్నీ ప్రేక్షకులే ఎన్నుకుంటారు. వారిలో ముందంజలో ఉన్న వారితో ఆరు నెలల్లో సినిమా తీసి విడుదల చేస్తామని ఆర్జీవీ తెలిపారు.
అలాగే కథకు సంబంధించిన ఒకట్రెండు లైన్లు వెబ్సైట్లో పెడతామని, ఆ లైన్లు నచ్చిన యాక్టర్లు, డైరెక్టర్లు, డీవోపీలు, సంగీత దర్శకులు ఇలా ఎవరైనా సరే.. తాము ఆ సినిమాకు పనిచేయాలనుకుంటే అప్లయ్ చేసుకోవచ్చని అన్నారు.
అప్లయ్ చేసుకున్న వారిలో ప్రేక్షకుల తీర్పు మేరకు వివిధ విభాగాల వారిని ఎన్నుకోవడం జరుగుతుందని, అలా ఎన్నుకున్నవారి నుంచి ఆర్జీవీ డెన్ టీమ్ షార్ట్ లిస్ట్ తయారు చేసి, వెబ్సైట్లో పెడుతుందని చెప్పారు. ఆ తర్వాత ఆడిషన్స్ జరుగుతాయని, అందులో ఉత్తీర్ణులైన వారితో సినిమా చేయడం జరుగుతుందని ఆర్జీవీ తెలిపారు.