Retro | తమిళ నటుడు సూర్య వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తుంటాడు. తాను చేసే ప్రయోగంలో ఫ్లాప్‌లు వచ్చిన వెనకంజ వేయడు. గత చిత్రం కంగువా డిజాస్టర్ కాగా, ఇప్పుడు తన 44వ చిత్రం రెట్రో అనే సినిమా చేశాడు. రొమాంటిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా గా రూపొందిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై కార్తీకేయన్ సంతానం, సూర్య, జ్యోతిక నిర్మాతలుగా మారి నిర్మించారు. పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్వకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జయరాం, జోజు జార్జ్, కరుణాకరన్, నాజర్, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు. నాని చిత్రం హిట్3కి పోటీగా ఈ మూవీ విడుదలైంది.
రెట్రో సినిమాకి మిక్స్డ్ టాక్ రాగా, బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించింది. ఫస్ట్ డే కలెక్షన్లు చూస్తే.. తమిళనాడులో రూ.17.25 కోట్లు వసూలు చేసిందని సమాచారం. కంగువా సినిమా కంటే ఇది ఎక్కువే. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 35 కోట్లకు పైగా వసూలు చేసిన రెట్రో రెండో రోజు కాస్త తక్కువ వసూళ్లే సాధించిన రూ. 50 కోట్లకు చేరువైందని చెబుతున్నారు. అయితే ఎంత వసూలు చేసిందనే దానిపై పూర్తి వివరాలు బయటకు రాలేదు. ఈ రోజు రేపు వీకెండ్స్ కాబట్టి వసూళ్లు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తం మీద రివ్యూస్ కాస్త డల్‌గా ఉన్నప్పటికీ సూర్య రెట్రో వసూళ్లలో కాస్త దూకుడు చూపిస్తుందనే అంటున్నారు.
సూర్య నటించిన రెట్రో సినిమాకి ఓవర్సీస్లో భారీగా స్పందన కనిపించలేదు. గల్ఫ్ దేశాల్లో కూడా ఈ సినిమాకు రెస్పాన్స్ అతంత మాత్రంగానే ఉంది. ఈ చిత్రం ఓవర్సీస్లో 9 కోట్ల రూపాయల మేర కలెక్షన్లు సాధించింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 36 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఇటీవల కాలంలో తమిళ సినిమాకు అత్యుత్తమ వసూళ్లు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే అయితే ఈ సినిమా సూర్య కెరీర్లోనే బెస్ట్ కలెక్షన్లను రాబట్టిందని అంటున్నారు. ఈ సినిమా వసూళ్లు ట్రేడ్ వర్గాల అంచనాలను కూడా దాటేశాయి. రానున్న రోజుల్లో ఈ సినిమా నిలకడగా వసూళ్లను సాధిస్తుందా లేదా అనేది చూడాలి.