Renu Desai | మేము ఏమైనా ఉగ్రవాదులమా .. ట్రోల్స్‌పై రేణు దేశాయ్ ఘాటు విమర్శలు
Renu Desai | ప్రముఖ నటి, రేణూ దేశాయ్ మరోసారి సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని బహిర్గతం చేశారు. ఇటీవల కాలంలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని కొందరు నెటిజన్లు చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న దూషణలను ఆమె తీవ్రంగా ప్రశ్నించారు.
Renu Desai | ప్రముఖ నటి, రేణూ దేశాయ్ మరోసారి సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని బహిర్గతం చేశారు. ఇటీవల కాలంలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని కొందరు నెటిజన్లు చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న దూషణలను ఆమె తీవ్రంగా ప్రశ్నించారు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో రేణు దేశాయ్ మాట్లాడుతూ, “కళాకారులు మీ దృష్టిలో నేరస్తులా? లేక ఉగ్రవాదులా? అంత దారుణమైన పదజాలంతో దూషించడానికి వారు ఏమి చేశారు?” అని ప్రశ్నించారు. ఒక వ్యక్తి చేసే పని లేదా అభిప్రాయం నచ్చకపోతే, వారిని అన్‌ఫాలో చేయడం మంచిదని సూచించారు. కానీ వ్యక్తిగతంగా దూషించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం డిజిటల్ యుగంలో ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో ఇతరుల మనోభావాలను దెబ్బతీయడం పెరిగిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “మీకు నచ్చని అభిప్రాయం చెబితే వెంటనే బూతులు తిట్టడం స్వేచ్ఛ కాదు. అది వేధింపే. ప్రతి ఒక్కరికీ గౌరవంగా బతికే హక్కు ఉంది” అంటూ ఆమె హితవు పలికారు. సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిన తర్వాత సెలబ్రిటీలకు ప్రైవసీ లేకుండా పోయిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చిన్న విషయానికే వేల సంఖ్యలో ట్రోల్స్ రావడం ఇప్పుడు సాధారణంగా మారిందని అంటున్నారు.
రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు మద్దతు తెలుపుతున్నారు. సైబర్ వేధింపులను అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమని సూచిస్తున్నారు. ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన నెగిటివ్ కామెంట్లను రేణు దేశాయ్ ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరోసారి ఆమె గళం వినిపించడం, సోషల్ మీడియాలో పెరుగుతున్న ట్రోలింగ్‌కు వ్యతిరేకంగా బలమైన సందేశంగా మారింది. మొత్తానికి, సెలబ్రిటీలపై పెరుగుతున్న ఆన్లైన్ వేధింపులపై మళ్లీ చర్చ మొదలైంది. అభిమానం, విమర్శలకి బ్రేక్ ఎక్కడ వేయాలో సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

