బాలు.. నీ పాట లేని ఏడాది.. ఎక్కడుంది మాకు ఆ సందడి..?

శ్రీపతి పండితారాజుల బాలసుబ్రమణ్యం ( SPB ).. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే ప్రతీ తెలుగు వాడి గుండెలో నిలిచిపోయే పేరు ఇది. తెలుగు పాట ఉన్నంత కాలం బాలు గారి పేరు అలాగే చరిత్రలో మిగిలిపోతుంది. అలాంటి బాలు లేని ఏడాది పూర్తైపోయింది. అయినా కూడా నువ్వు లేకపోవడం ఏంటయ్యా.. నువ్వు భౌతికంగా లేవయ్యా అంతే.. నీ పాటలు మాత్రం అలాగే ఉన్నాయయ్యా.. బాలు నువ్వు లేకపోవడం ఏంటయ్యా అంటూ సగటు సినీ అభిమానులు వేదన పడుతున్నారు. నీ పాట లేని ఈ ఏడాది మేమంతా అనాథల్లా నిలిచిపోయావయ్యా.. అంటూ సంగీత అభిమానుల గుండెలు మనసులో విషాద రాగాలు పాడుకుంటున్నాయి.
జో అచ్యుతానందా అంటూ నువ్వు పాడిన పాటలే కదయ్యా మాకు జోల పాటలు.. అబ్బనీ తియ్యనీ దెబ్బ అంటూ నువ్వు పాడిన పాటే కదయ్యా మాకు యుగళ గీతం.. అదిగో అల్లదిగో అంటూ నువ్వు పాడిన పాటే కదయ్యా మాకు కలియుగ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేయించింది.. నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా అంటూ నువ్వు అడిగిన ప్రశ్నలతోనే కదయ్యా మాలో మాకు తెలియని ప్రశ్నలు మొదలయ్యింది.. ఇలా బాలు పాడిన ప్రతీ పాటను గుర్తు చేసుకుంటూ ఆయన లేని ఈ 365 రోజులను గుర్తు చేసుకుంటూ బాధ పడుతున్నారు అభిమానులు. ఎస్పీ బాలు ఎప్పుడు స్టేజీపై కనిపించినా కూడా ఏదో తెలియని సందడి కనిపిస్తుంది. సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా అందర్నీ ఎస్పీబీ ఆటపట్టించే తీరు.. వాళ్లతో ఆడుకునే జోరు ఇంకెవరిలోనూ మనం చూడలేం. అవన్నీ ఇప్పుడు మిగిలిపోయిన గుర్తులే అని తెలిసిన తర్వాత గుండె తెలియని బరువెక్కుతుంది.
నువ్వు లేవనే భావనే మాకు లేదయ్యా.. కాకపోతే కళ్ల ముందు కనిపించడం లేదు కదా బాలు.. అందుకే ఏదో చిన్న బాధ మాత్రం లోపల అలాగే ఉండిపోయింది. అయినా ఎక్కడో ఓ చోట మళ్లీ నువ్వు పుడుతావులే.. నీకు ఆ పాటలంటే ఎంత ప్రాణమో మాకు తెలియదా.. అందుకే కచ్చితంగా మా కోసం కాకపోయినా నీవు ప్రాణంగా ప్రేమించే పాట కోసమైనా మళ్లీ ఎక్కడో ఓ చోట పుట్టే ఉంటావులే బాలు..! ఒక్కసారి మళ్లీ కనిపించవయ్యా.. నీ మధురమైన పాట వినే భాగ్యం మళ్లీ కలిగించవయ్యా అంటూ దేవుడిని బాలు అభిమానులు మనస్పూర్థిగా కోరుకుంటున్నారు. ఏదేమైనా బాలు లేని ఈ ఏడాది మాత్రం భారంగానే గడిచింది. కాలం మరుపు అనే మందును ఇస్తుంది కాబట్టి ఆయన పాటలే బాలు గుర్తులను మనకు గుర్తులుగా మిగిలిపోతాయంతే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Love story | లవ్‌స్టోరి సినిమా రివ్యూ
సాయిపల్లవిలో ఏదో తెలియని మ్యాజిక్ ఉందబ్బా..
వేణు మాధవ్ రెండో వర్ధంతి.. నల్ల బాలును మరోసారి గుర్తు చేసుకుందామా..!
Samantha Akkineni | సమంత లవ్‌స్టోరి సినిమా చూడదట!
అనుష్క పెళ్లి విషయంలో జ్యోతిష్కుడు కీలక వ్యాఖ్యలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

