Dhamaka Movie Trailer | ప్రస్తుతం రవితేజను వరుసగా ఫ్లాప్‌లు వెంబటిస్తున్నాయి. ‘క్రాక్’ వంటి భారీ విజయం తర్వాత ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’లు డిజాస్టర్లు కావడంతో రవితేజ తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం ఆయన ఆశలన్ని ధమాకా పైనే ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాకు త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్లు సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.
ఎప్పుడెప్పుడా అని మాస్‌రాజా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ట్రైలర్ డేట్‌ను తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 15న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇక ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ మూవీ రన్‌టైమ్ కూడా రెండున్నర గంటల లోపే ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమా రవితేజ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో రూపొందింది. రవితేజకు జోడీగా ‘పెళ్ళి సందD’ ఫేం శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ-స్క్రీన్‌ప్లే-మాటలు అందిస్తున్నాడు. భీమ్స్ సిసిరోలియో బాణీలు సమకూర్చాడు.
అయితే ‘ధమాకా’ సినిమా చుట్టు పెద్ద వలయమే ఉంది. ఈ సినిమాకు పోటీగా నాలుగు సినిమాలు రాబోతున్నాయి. ఈ సినిమాకు ముందు రోజు విశాల్ ‘లాఠీ’, నయనతార ‘కనెక్ట్’ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. డబ్బింగ్ సినిమాలే అయిన ఈ రెండిటిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ధమాకా రిలీజ్ రోజునే నిఖిల్ ’18పేజీస్’ కూడా రానున్నట్లు తెలుస్తుంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న నిఖిల్ ఇందులో హీరోగా చేయడంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఇక అదే రోజున మరో తెలుగు డబ్బింగ్ సినిమా ‘సర్కస్’ కూడా రిలీజ్ కాబోతుంది. మాస్ కామెడీని డీల్ చేయడంలో సిద్ధహస్తుడైన రోహిత్ శెట్టి దర్శకుడు కావడంతో ఈ సినిమాపై కూడా మంచి హైప్ ఉంది. వీటిన్నిటిని పక్కన పెడితే ‘అవతార్-2’ సినిమా మరింత భయాన్ని కలిగిస్తుంది. అవతార్-2 మూవీ ధమాకా సినిమాకు వారం రోజుల ముందు రిలీజ్ కానుంది. ఈ సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చిందా కనీసం మూడు వారాలు స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తుంది. ఇప్పటికే ప్రీ బుకింగ్స్‌తోనే తెలుగులో రికార్డులు క్రియేట్ చేస్తుంది. మరీ ఇన్ని సినిమాల పోటీలను తట్టుకొని రవితేజ నిలుస్తాడా లేదా అనేది డిసెంబర్ 23న తెలుస్తుంది.
MassMaharaja @RaviTeja_offl 's
Mass Storm From Dec 15th💥#Dhamaka Trailer Releasing on Dec 15th🤩#DhamakaFromDec23Subscribe to 👇https://t.co/tixSag3AVp@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada @sujithkolli @AAArtsOfficial pic.twitter.com/P0X9AebVqj
— People Media Factory (@peoplemediafcy) December 11, 2022