Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ యువ హీరోలకు పోటీనిస్తున్నాడు. ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆచార్య’. కోరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ మరో ప్రాధాన పాత్రలో నటించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న విడుదల కానున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. దీనితో పాటుగా మరో మూడు సినిమాలు సెట్స్ ఉన్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ చిత్రంలో మాస్రాజ రవితేజ కీలక పాత్రలో నటించనున్నట్లు గతం నుంచే వార్తలు వస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ వర్గాల్లో అందుతున్నసమాచారం ప్రకారం ఏప్రిల్‌లో రవితేజ ఈ చిత్రం షూటింగ్లో పాల్గొంటాడని తెలుస్తుంది. రవితేజ కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో తీరిక లేకుండా షూటింగ్లలో పాల్గొంటున్నాడు. ‘అన్నయ్య’ సినిమా తర్వాత మళ్లీ వీళ్లీద్దరూ కలిసి నటిస్తుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ సంస్థ నిర్మిస్తుంది. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచినట్లు తెలుస్తుంది. వీటితో పాటుగా చిరు గాడ్‌ఫాదర్, భోళా శంకర్ సినిమాలలో నటిస్తున్నాడు.