Raviteja | మాస్ మహారాజా రవితేజ ఓ వైపు హీరోగా పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంటూనే, మరో వైపు మెగాస్టార్ కోసం ‘వాల్తేరు వీరయ్య’లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రవితేజ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన టీజర్ గ్లింప్స్ రిలీజ్ కాగా.. దానికి ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన వచ్చింది. దర్శకుడు బాబీ, రవితేజ క్యారెక్టర్‌ను పవర్ ఫుల్‌గా రాసుకున్నట్లు టీజర్‌తోనే క్లారిటీ ఇచ్చేశాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా నిడివి 2గంటల 35 నిమిషాలు ఉండగనుందట.
రవితేజ ఈ సినిమాలో కేవలం గెస్ట్ పాత్రలో కనిపించడం లేదన్న క్లారిటీ ఇటీవలై రిలీజైన గ్లింప్స్ చూస్తే తెలుస్తుంది. అయితే రవితేజ ఈ సినిమాలో ఎంత సేపు కనిపించున్నాడు అనే ప్రశ్న ప్రతీ ప్రేక్షకుడి మదిలో మెదులుతుంది. కాగా ఈ సినిమాలో రవితేజ పాత్ర దాదాపు 45నిమిషాలు ఉండనుందట. దాదాపు మల్టీస్టారర్ సినిమాలో ఒక హీరో రన్‌టైమ్ కూడా కాస్త అటు ఇటుగానే ఉంటుంది. అయితే ఈ సినిమాలో రవితేజ పాత్ర చివర్లో చనిపోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే సినిమా రిలీజయ్యే వరకు వేచి చూడాల్సిందే. అంతేకాకుండా చిరంజీవి రోల్ మొత్తం రవితేజ పాత్ర చుట్టే తిరుగుతుందట.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ మూవీలో చిరంజీవి ఫిషింగ్ యార్డ్ యూనియన్ లీడర్‌గా కనిపించనున్నాడు. చిరంజీవికి జోడీగా శృతిహాసన్ నటిస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన బాస్ పార్టీ, శ్రీదేవి.. చిరంజీవి పాటలకు విశేష స్పందన వచ్చింది.