‘ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు.. ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు.. ఈ దేవుడు మంచోడు కాదు.. మొండోడు..’ ‘ఈగల్’ ట్రైలర్ చివర్లో రవితేజ చెప్పే డైలాగ్ ఇది. హీరో కేరక్టరైజేషన్కీ, కథకూ దర్పణంలా ఈ డైలాగ్ ఉంది. ట్రైలర్‌తో చూచాయగా కథ చెప్పేశాడు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. జనవరి 13న సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేశారు.
ట్రైలర్‌ని బట్టి చూస్తే రవితేజ పాత్రలో విభిన్న కోణాలు కనిపిస్తున్నాయి. ఆయన రెండు గెటప్పుల్లో కనిపిస్తున్నారు. ఆద్యంతం యాక్షన్ డ్రామాగా హాలీవుడ్ స్థాయి మేకింగ్ ట్రైలర్లో దర్శనమిస్తున్నది. మాస్ ప్రేక్షకులే లక్ష్యంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం రవితేజ కెరీర్లో మైలురాయిగా నిలుస్తుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతున్నది. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ ఇందులో హీరోయిన్లు కాగా, మధుబాల, నవదీప్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: మణిబాబు కరణం, సంగీతం: దావ్జాంద్.