‘ఇరుముడి’తో బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ని అందుకున్నారు అగ్ర కథానాయకుడు రవితేజ. ఆ జోష్‌లోనే తన నెక్ట్స్ సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నారాయన. హసిత్గోలీ దర్శకత్వం వహించనున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మించనున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించడం విశేషం. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నది.
కేవలం తన ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తోనే సినిమాను మరోస్థాయిలో నిలబెట్టగలరు రవితేజ. ‘రాజ రాజ చోర’ వంటి కామెడీ ఎంటర్టైనర్తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హసిత్ గోలీ. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఓ ప్రత్యేకమైన అనుభూతిని ఇవ్వనున్నదని నిర్మాతలు చెబుతున్నారు. హ్యూమర్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం టైటిల్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కూడా త్వరలోనే వెల్లడికానున్నాయి.