‘నాకు ఇష్టమైన హీరోల్లో రవితేజ ఒకరు. ఆయనతో సినిమా చేయాలన్నది నా కల. అది ‘ధమాకా’తో నెరవేరింది’ అని అన్నారు త్రినాథ రావు నక్కిన. ఆయన దర్శకత్వంలో రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ‘ధమాకా’ చిత్రం ఈ నెల 23 ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు త్రినాథ రావు నక్కిన పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
గత కొంతకాలంగా రవితేజ విభిన్న కథా చిత్రాల్లో నటించారు. అయితే ఆయన తరహా మాస్, కామెడీ అంశాల్ని ప్రేక్షకులు మిస్ అవుతున్నారనే భావన ఉంది. వాటిని ఈ సినిమాలో చూస్తారు. ‘ధమాకా’ పక్కా కమర్షియల్ సినిమా. రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారు. రెండు పాత్రలు భిన్న ధృవాలుగా సాగుతాయి. ఈ సినిమాలో వినోదంతో పాటు అందమైన ప్రేమకథ, ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోసి ఉంటాయి. రవితేజ శైలి యాక్షన్ మెప్పిస్తుంది.
అందుకే సక్సెస్ ఉంటుంది
ఈ సినిమా మ్యూజికల్‌గా బ్లాక్‌బస్టర్ అయింది. భీమ్స్ సిసిరోలియో మంచి పాటలిచ్చాడు. రవితేజగారు నన్ను బెస్ట్ ఆడియన్ అంటారు. ‘సాధారణ ప్రేక్షకులు ఎంజాయ్ చేసే అంశాల్ని నువ్వు బాగా ఇష్టపడతావు. అందుకే నీకు ఎప్పుడూ సక్సెస్ ఉంటుంది’ అని రవితేజ చెప్పారు. నా తదుపరి సినిమాల్ని మైత్రీ మూవీ మేకర్స్, దిల్‌రాజు సంస్థల్లో చేయబోతున్నా. రెండు సినిమాలకూ కథలు సిద్ధమయ్యాయి.