హీరోలతో పోల్చితే నాయికలుగా తమ ఘనతను గుర్తించడంలో తేడాలు చూపిస్తుంటారని వాపోతున్నది నటి రవీనాటాండన్. అవిశ్రాంతంగా కెరీర్ కొనసాగిస్తున్నా…మమ్మల్ని 90 దశకపు తారలనే పిలుస్తుంటారని బాధపడుతున్నది. రవీనా మాట్లాడుతూ…‘హీరోలు ఒక్కో సినిమాకు రెండేళ్లు గ్యాప్ తీసుకుంటారు. మళ్లీ వాళ్లో కొత్త సినిమా చేస్తే అంతా మర్చిపోతారు. మేము కొద్ది రోజులు కనిపించకున్నా…సెకండ్ ఇన్నింగ్స్ అని ముద్ర వేస్తారు’ అని చెప్పింది. ‘కేజీఎఫ్’ రెండు భాగాల చిత్రాలతో మరోసారి ఆకట్ట్టుకుంది రవీనా.