టాలీవుడ్ (Tollywood) హీరో రవితేజ (Ravi Teja) నటిస్తోన్న క్రేజీ చిత్రాల్లో ఒకటి రావణాసుర (Ravanasura). టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 14న గ్రాండ్‌గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెబుతూ షూటింగ్ మొదలుపెట్టాడు మాస్ మహారాజా. యాక్షన్ జోనర్ లో వస్తున్న ఈ మూవీ చిత్రీకరణ మొదలైన సందర్భంగా సెట్స్ లో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ( Faria Abdullah ), డైరెక్టర్ తో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశాడు రవితేజ. మొదటి రోజు..రావణాసుర..చాలా ఎక్జయిటింగ్‌గా ఉంది అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
తాజా సెకండ్ షెడ్యూల్ పలు కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఈ చిత్రంలో సుశాంత్ (Sushanth ) కీలక పాత్రలో నటిస్తుండగా..మేఘా ఆకాశ్, అనూ ఇమ్మాన్యుయేల్ ఇతర ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. హర్షవర్దన్ రామేశ్వర్-బీమ్స్ సిసిరొలియో ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30 థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది రావణాసుర ప్రాజెక్టు.
రవితేజ ఇప్పటికే ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఖిలాడి చిత్రీకరణ పూర్తి చేసుకుని..ఈ నెల 11న విడుదల కానుంది. మొత్తానికి ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అందరినీ ఎంటర్ టైన్ చేయడం పక్కా అంటున్నాడు రవితేజ.