గిరిజన వీరనారిగా అగ్ర కథానాయిక రష్మిక మందన్న నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’. రవీంద్ర పుల్లె దర్శకుడు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్ డేట్‌ని మంగళవారం అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ‘మైసా’ విడుదల కానున్నది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో.. ఒక పెద్ద ఈటె పట్టుకుని, శరీరంపై యుద్ధ గాయాలతో నిలబడి ఉన్న రష్మికను చూడొచ్చు. ఇది యాక్షన్‌తో కూడిన పీరియడ్ డ్రామా అని ఈ స్టిల్ చెబుతున్నది.
‘ఉత్కంఠ భరితమైన పోరాటాలతో ఓ బెంచ్ మార్క్‌ని క్రియేట్ చేసేలా ఈ సినిమా రూపొందుతున్నది. అద్భుతమైన వీఎఫ్ఎక్స్తో విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రష్మిక అంకితభావంతో పనిచేస్తున్నారు. ఇటీవలే యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా ఆమె గాయపడ్డ విషయం తెలిసిందే. గాయం నయం కాగానే తిరిగి షూటింగ్లో పాల్గొని చివరి దశ షూటింగ్‌ని పూర్తి చేస్తారు. ఇంకా 12రోజుల షూటింగ్ మాత్రమే మిగిలివున్నది’ అని మేకర్స్ తెలిపారు. శరవేగంగా పోస్ట్‌ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి కెమెరా: శ్రేయాస్ పి.కృష్ణ, సంగీతం: జేక్స్ బెజోయ్.