కోలీవుడ్ (kollywood) అగ్ర హీరో విజయ్ (Vijay) నటించిన బీస్ట్ సినిమా విడుదలకు ముస్తాబవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు నేషనల్ అవార్డు విన్నింగ్ టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally)తో విజయ్ 66వ (Vijay 66th) సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. కాగా ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి టాలీవుడ్ సర్కిల్‌ను రౌండప్ చేస్తోంది.
కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna)ను ఫీ మేల్ లీడ్ రోల్లో తీసుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నారట మేకర్స్. విజయ్ను ఎంతగానో అభిమానించే హీరోయిన్లలో రష్మిక కూడా ఒకరు. ఈ విషయాన్ని రష్మిక చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. అలాంటిది ఏకంగా తన ఫేవరేట్ స్టార్ హీరోతోనే నటించే అవకాశం వస్తే రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమైనట్టే.
ఒకవేళ ఇదే జరిగితే రష్మిక కెరీర్‌కే ఇది పెద్ద టర్నింగ్ పాయింట్ కానుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కథానుగుణంగా అవసరమమ్యే రాజభవంతి సెట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నట్టు సమాచారం. ఒకవేళ సెట్ రెడీ చేయడం ఆలస్యమైతే థమన్ కంపోజిషన్ లో విజయ్, రష్మిక వచ్చే ఓ పాటను షూట్ చేయనుందట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations) బ్యానర్‌పై టాలీవుడ్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.