Rashmika Mandanna | రష్మిక మందన్నకు అన్ని భాషలు వచ్చా? నేషనల్ క్రష్ భలేగా నేర్చేసుకుందిగా..
Rashmika Mandanna | కన్నడ సోయగం రష్మిక మందన్న బహుముఖ ప్రజ్ఞాశాలి. కేవలం నటన మాత్రమే కాకుండా ఇంగ్లీష్‌లో కవితలు రాయడంలో ఈ అమ్మడికి మంచి ప్రావీణ్యం ఉంది. అలాగే ఆరు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు.
Rashmika Mandanna | కన్నడ సోయగం రష్మిక మందన్న బహుముఖ ప్రజ్ఞాశాలి. కేవలం నటన మాత్రమే కాకుండా ఇంగ్లీష్‌లో కవితలు రాయడంలో ఈ అమ్మడికి మంచి ప్రావీణ్యం ఉంది. అలాగే ఆరు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. ఇటీవల షూటింగ్ విరామంలో సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించింది రష్మిక మందన్న. వారు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలిచ్చింది. అభిమానులకు వారి మాతృభాషలోనే బదులిస్తూ తన భాషా ప్రావీణ్యాన్ని చాటుకుంది.
తన ఆసక్తులతో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంది. కర్ణాటక కూర్గ్ పట్టణంలో ఉన్న తన స్వగృహం ఈ భూమి మీద తనకు అత్యంత ఇష్టమైన ప్రదేశమని రష్మిక మందన్న పేర్కొంది. నటన మీద మక్కువతోనే వివిధ భాషల్ని నేర్చుకున్నానని, అభిమానులతో వారి సొంత భాషలో మాట్లాడటం వారికిచ్చే నిజమైన గౌరవంగా భావిస్తానని చెప్పింది. ‘నేను ఆరు భాషల్లో మాట్లాడగలను.
నేను హైదరాబాద్ వాళ్లతో మాట్లాడేటప్పుడు ‘నమస్తే బాగున్నారా’ అని పలకరిస్తాను. ఒక రాష్ట్రంలో పనిచేస్తున్నప్పుడు అక్కడి భాషను నేర్చుకోవడం తప్పనిసరైన విషయంగా నేను భావిస్తా’ అని రష్మిక మందన్న చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ పుష్ప-2, యానిమల్, రెయిన్ బో చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

