Rashmika Mandanna | నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకి ప్రమాదం జరిగింది. రష్మిక జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తుండగా.. కాలికి గాయం అయినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంపై డాక్టర్‌ను కలువగా.. గాయం చిన్నదే అని.. పెద్దగా ప్రమాదం లేదని చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఒక వారం పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో రష్మిక ప్రస్తుతం ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇటీవలే పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకుంది. ఇప్పటికే యానిమల్తో హిట్‌ని ఖాతాలో వేసుకున్న ఈ భామకి పుష్ప 2 తోడవడంతో రష్మిక రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మరోవైపు ఈ ఏడాది రష్మిక నటిస్తున్న చిత్రాలలో చావా(Chaava) సినిమా ఒకటి. విక్కీ కౌశల్ హీరోగా వస్తున్న ఈ సినిమా మహరాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రాబోతుంది. ఇదే కాకుండా సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా వస్తున్న సికిందర్ చిత్రంలో కూడా కీలక పాత్రలో నటిస్తుంది ఈ భామ.