Rashmika | నేషనల్ క్రష్ రష్మిక మందన్న అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. కొంతకాలంగా షూటింగులకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న ఈ స్టార్ హీరోయిన్.. త్వరలోనే తిరిగి సినిమా సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక మందన్న.. ‘మైసా’ సినిమా షూటింగ్లో భాగంగా ఓ పాటను చిత్రీకరిస్తున్న సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆమె కుడి కాలు తుంటి భాగానికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు కొంతకాలం పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది.
గాయం కారణంగా షూటింగులకు దూరంగా ఉన్నప్పటికీ రష్మిక సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటూ అభిమానులతో తన విశేషాలను పంచుకుంటున్నారు. తన రికవరీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ అభిమానులకు ధైర్యం చెబుతూ వచ్చారు. తాజాగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ త్వరలోనే తిరిగి షూటింగులకు హాజరుకానున్నట్లు తెలిపారు. “త్వరలోనే సెట్స్‌కి వెళ్తాను. కాకపోతే వీటన్నిటినీ మిస్ అవుతాను” అంటూ ఆమె చేసిన పోస్ట్ అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. ఈ ఫొటోలు, వీడియోల్లో రష్మిక తన ఖాళీ సమయాన్ని ఎలా గడుపుతున్నారో చూపించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆత్మీయులను కలుసుకోవడం, తనకు నచ్చిన పనులు చేస్తూ సరదాగా గడపడం, పెంపుడు కుక్కతో ఆడుకోవడం, ప్రకృతిని ఆస్వాదించడం వంటి క్షణాలను ఆమె అభిమానులతో పంచుకున్నారు.
గాయం నుంచి పూర్తిగా కోలుకుంటున్న రష్మికలో మళ్లీ పాజిటివ్ ఎనర్జీ కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక చేతిలో పలు ఆసక్తికరమైన సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా ‘మైసా’, ‘రణబాలి’ చిత్రాలు ఆమె కెరీర్లో కీలకంగా నిలవనున్నాయి. ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ పనులు ఇప్పటికే కొనసాగుతున్నాయి. అయితే రష్మిక గాయపడటంతో కొంతకాలం ఆమె షూటింగ్ షెడ్యూల్స్కు బ్రేక్ పడింది. ఇప్పుడు ఆమె రీఎంట్రీ ఇవ్వబోతుండటంతో ఈ సినిమాల చిత్రీకరణ మళ్లీ వేగం పుంజుకునే అవకాశం ఉంది. మరోవైపు రష్మిక నటిస్తున్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘రాకా’. ఈ సినిమాకు వచ్చే నెలాఖరు నుంచి ఆమె కాల్షీట్లు కేటాయించినట్లు సమాచారం. దీంతో రష్మిక రాబోయే రోజుల్లో వరుసగా షూటింగులతో బిజీ కానున్నట్లు తెలుస్తోంది.