Rashmika | ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన రష్మిక మందాన ఆ తర్వాత వైవిధ్యమైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఈ అమ్మడు చేసిన యానిమల్, పుష్ప 2, ఛావా లాంటి సినిమాలు ఎంత పెద్ద విజయాలు అందించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూడు సినిమాలతో అమ్మడు బాక్సాఫీస్ క్వీన్ అయిపోయారు రష్మిక మందాన. ఇప్పుడు టాలీవుడ్లోనే కాక బాలీవుడ్‌లోను రష్మిక క్రేజ్ పీక్స్‌కి చేరింది. ఈ మధ్య సల్మాన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన సికిందర్ సినిమాతో ప్లేక్షకులని పలకరించిన ఈ ముద్దుగుమ్మకి నిరాశే ఎదురైంది. చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న రష్మికకి సికిందర్ రూపంలో బ్రేక్ పడింది. అయితే ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానాతో తమా సినిమా చేస్తున్నారు ఈ బ్యూటీ. ఇది మినహా మరే సినిమాకు సైన్ చేసినట్టు కనిపించడం లేదు. తెలుగులో ఎప్పుడో ఓకే చేసిన గాళ్‌ఫ్రెండ్, రెయిన్ బో సినిమాలతోనే సరిపెట్టుకున్నారు. ఈమె తీరు చూస్తుంటే కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తున్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా రష్మిక, విజయ్ దేవరకొండ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారని, త్వరలోనే వారిద్దరి వివాహం జరగనుందని కొందరు జోస్యాలు కూడా చెబుతున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మిక గురించి మాట్లాడిన విజయ్ దేవరకొండ.. ఆమె చాలా మంచి వ్యక్తి. ఇంకా ఎన్నో మూవీస్‌లో తనతో యాక్ట్ చేయాలని ఉంది అని అన్నారు. మరి జీవిత భాగస్వామికి కావాల్సిన లక్షణాలు రష్మికలో ఉన్నాయా అనే ప్రశ్న ఎదురు కాగా, మంచి మనసు ఉన్న అమ్మాయి ఎవరైనా పర్వాలేదు అని సమాధానం చెప్పారు. మరి విజయ్ దేవరకొండ చెప్పిన సమాధానం బట్టి చూస్తుంటే తమ ప్రేమ గురించి క్లూ ఇచ్చారని, అఫీషియల్‌గా ప్రకటించడమే తరువాయి అని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్గా జీ సినిమా అవార్డ్స్ ఈవెంట్‌కి హాజరైంది రష్మిక. బ్లాక్ డ్రెస్‌లో బోల్డ్‌గా కనిపిస్తూ అక్కడ ఉన్నవారితో సందడి చేసింది. ఫోటోగ్రాఫర్స్‌తో ఫొటోలకి పోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.